ప్రచురణ తేదీ : Thu, Oct 12th, 2017

ప్రొఫెసర్ వెంకీ.. తేజ చేతిలో పడితే అంతే..!


విక్టరీ వెంకటేష్ తన తదుపరి చిత్రం కోసం తేజ దర్శకత్వంలో నటించబోతున్నాడు. నేనే రాజు నేనే మంత్రి చిత్ర విజయంతో తేజ హుషారు మీద ఉన్నాడు. కాగా ఈ చిత్రంలో వెంకీ పాత్రకు సంభందించి ఆసక్తికరమైన ప్రచారం జరుగుతోంది. తేజ వెంకీని రెండు విభిన్నమైన షేడ్స్ ఉన్న పాత్రల్లో చూపించబోతున్నాడని టాక్. అందులో ఓ పాత్ర కోసం వెంకీ ప్రొఫెసర్ గా నటిస్తాడని సమాచారం.

ఎలాంటి హీరో అయినా తేజ చేతుల్లో పడితే చాలు వారిలోని నటుడిని పూర్తి స్థాయిలో వాడుకుంటాడు. ఇక వెంకీ నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కాగా ఈ చిత్రం నవంబర్ నుంచి సెట్స్ పైకి వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ చిత్రాన్ని ఏ కె ఎంటర్టైన్మెంట్స్, సురేష్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మించనున్నారు.

Comments