లోకేష్ చెప్పింది తప్పు..ఆయనకు నాకు ఉన్న తేడా అదే – చంద్రబాబు

స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ పై జరిగిన ఓ సదస్సులో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఐటి శాఖా మంత్రి నారా లోకేష్ కలసి పాల్గొన్నారు. ఈ సభలో నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలతో తాను డిఫర్ అవుతున్నానని చంద్రబాబు చేసిన కామెంట్స్ ఆసక్తిని కలిగించాయి. సరదాగా మాట్లాడుతూనే తాను లోకేష్ తో ఎందుకు విభేదిస్తున్నానో చంద్రబాబు వివరించారు.

ఈ కార్యక్రమంలో మొదట ఐటి శాఖా మంత్రి లోకేష్ ప్రసంగించారు. మన రాష్ట్రానికి చెందిన యువత ఐటి రంగంలో రాణిస్తున్నారని అన్నారు. కానీ వారంతా హైదరాబాద్, బెంగుళూరు మరియు విదేశాల్లో ఉద్యోగాలు చేయడానికి సిద్దపడుతున్నారని అన్నారు. అలా కాకుండా ఐటి యువత మన రాష్ట్రంలోనే ఉద్యోగాలు చేసేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ.. నేను లోకేష్ వ్యాఖ్యలతో డిఫర్ అవుతున్నాను. వేరే ప్రాంతాలకు వెళుతున్న యువత ఇక్కడికే రావాలని అన్నాడు. నా ఆలోచన ఏమిటంటే, మీరు ప్రపంచమంతా వెళ్ళాలి. ఎక్కడ చూసిన తెలుగు వారే ఉండాలి. తెలుగు వారు ప్రపంచాన్ని జయించే స్థితిలో ఉండాల్సిన అవసరం ఉంది అని చంద్రబాబు వ్యాఖ్యానించారు.

Comments