ప్రచురణ తేదీ : Wed, Sep 13th, 2017

పెళ్లి చేసుకో అన్నందుకు గొంతు కోసేశాడు.. వీడిన మర్డర్ మిస్టరీ

మియాపూర్ లో కలకలం సృష్టించిన ఇంటర్ విద్యార్థిని చాందిని మర్డర్ మిస్టరీని ఎట్టకేలకు పోలీసులు ఛేదించారు. శనివారం కనిపించకుండా పోయిన ఆ అమ్మాయి సోమవారం అమీన్‌ పూర్‌ కొండల్లో నిర్మానుషమైన ప్రాంతాల్లో శవంగా కనిపించింది. మొదట మిస్సింగ్ కేసుగా నమోదు చేసుకున్న పోలీసులు అమ్మాయి శవం దొరకగానే మర్డర్ కేసుగా నమోదు చేసుకొని హంతకుడి కోసం గాలింపు చర్యలు చేపట్టి ఒక్క రోజులోనే కేసును ఛేదించారు.

మొదట పోలీసులు మృతురాలి స్నేహితులను విచారించగా ఆమె గత కొన్ని రోజులుగా మదీనా గూడలోని ఓ డిగ్రీ విద్యార్థితో క్లోజ్ ఉన్నట్లు తెలుసుకొని అతన్ని విచారించారు. అయితే అతను శనివారం ఆమెను గుట్టల వైపు తీసుకెళ్లినట్టుగా పోలీసులు గుర్తించారు అలాగే ప్రాథమిక ఆధారాలను బట్టి ఆమెపై అత్యాచారయత్నం చేసి ఆ తర్వాత హత్య చేసి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఈ హత్య చేయడానికి కారణం మృతురాలు అతన్ని గత కొంత కాలంగా పెళ్లి చేసుకొమ్మని ఒత్తిడి చేసినందుకు డిగ్రీ విద్యార్థి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. అలాగే పోలీసుల విచారణలో అతనే యువతిని చంపారని పోలీసులు నిర్దారణకు వచ్చారు

Comments