అమెరికా నేర్పిన ప్రకృతి పాఠం! భారతీయులకే ఇది సాధ్యం!

అమెరికా, ప్రపంచంలో అత్యంత సంపన్న దేశం, ప్రపంచ దేశాలకి పెద్దన్న అగ్రరాజ్యం. ఆ అగ్రరాజ్యం ఎం చెబితే జీ హుజూర్ అంటూ తలాడించే అన్ని దేశాలు ఇప్పటి వరకు చూస్తున్నాం. భారత్ తో సహా చాలా దేశాలు అమెరికా ఆర్ధిక వ్యవస్థ మీద ఆధారపడి బ్రతుకుతున్నాయి. అమెరికాలో ట్రంప్ ఏదైనా నిర్ణయం తీసుకుంటే అది ఇండియన్ స్టాక్ మార్కెట్ మీద పడుతుంది. అమెరికా మీద ఎవరైనా దాడులు చేస్తామని ప్రకటిస్తే ఇండియా స్టాక్ మార్కెట్ దెబ్బతింటుంది. అమెరికాలో ఆర్ధిక వ్యవస్థ దెబ్బతింటే ఇక్క ఐటీ ఉద్యోగాలు ఊడుతాయి. ఇక భారతీయులు అయితే ఎంత సేపు అమెరికా నామస్మరణ చేయకుండా ఒక్క రోజు కూడా నిద్ర పోరంటే అసలు అమెరికా మీద భారతీయులు ఎంతగా ఆధారపదిపోయారో అర్ధమవుతుంది. మరి అంతగా అమెరికాలో ఏముంది అంటే అభివృద్ధి అని అందరు చెబుతారు. ప్రపంచ దేశాలు ఈర్ష్య పడే స్థాయిలో అమెరికా ఆర్ధిక వ్యవస్థ ఉంటుంది అని ఊదరగొడతారు. ఆ దేశంలో ఎ పట్టణం వెళ్లి చూసిన పరిశుభ్రంగా, చాలా కాంతివంతంగా, చూడగానే ఆకట్టుకునే విధంగా ఉంటుంది అంటారు. మరి అంత ఆకట్టుకునే నగరాల మీద ప్రకృతికి ఎందుకంత కోపం అంటే. అభివృద్ధి ముసుగులో చేసిన అరాచకం. కాంక్రీట్ జంగిల్స్ కోసం చక్కనైన మొక్కని నరికేశారు. ఇదే ఇప్పుడు అమెరికాకి పెద్ద శాపం.

అమెరికా అయినా, బ్రిటన్ అయినా, జపాన్ అయినా ప్రకృతి ప్రకోపానికి బలవుతున్నాయి అంటే దానికి కారణం,అభివృద్ధి మాటున వాళ్ళు చేసిన వినాశనం. పట్టనీకరణ, సాంకేతిక విజ్ఞానం ముసుగులో వారు చేసిన కిరాతకం ఇప్పుడు ప్రళయ కాలంలో కాపాడండి అని కేకలు పెట్టేలా చేస్తుంది. ఇప్పుడు హారికేన్స్, తుఫాన్స్, భూకంపాలు రూపంలో జనం గుండె చప్పుడు ఆగిపోవడానికి కారణం అయ్యింది. ప్రతి ఏడాది అమెరికా మీద విరుచుకుపడే హారికేన్స్ కేవలం వారి స్వార్ధం వలన వచ్చినవి కావా. కచ్చితంగా వారి ఆధిపత్య ధోరణిలో ప్రపబంచ విజేత అనిపించుకోవడానికి వారు అవలంబించే విధానాల వలెనే వచ్చాయి. ఇది ముమ్మాటికి నమ్మాల్సిన నిజం.

మరి అమెరికాని ఆదర్శంగా తీసుకొని ఏదో అగ్రరాజ్యంగా గుర్తింపు పొందాలని అబివృద్ధి మాత్రం జపిస్తూ వినాశనం వైపు అడుగులు వేస్తున్న భారతదేశం, ఇక్కడి ప్రభుత్వాలు, ప్రజలు నేర్చుకోవడానికి చాలా ఉంది. భారత దేశం అంటే కర్మభూమి అని మనం గొప్పగా చెప్పుకుంటాం. ఇక్క పుట్టే ప్రతి జీవి మరో జీవితో అనుబంధం కలిగి, ప్రళయకాలంలో ఒకరిని ఒకరు రక్షించుకుంటాయి అని మన పురాణాలు చెబుతున్నాయి. కొన్ని సంఘటనలు చూస్తే అది నిజమే అనిపిస్తుంది. ఇప్పటికే చెట్టు చాటున ఉన్న పట్టణాలు మన భారత దేశంలో చాలా ఉన్నాయి. ఆ చెట్లు మనిషికి ప్రాణ వాయువుతో పాటు. ప్రలయాల నుంచి రక్షణ కూడా ఇస్తున్నాయి. మొక్కని దేవతగా పూజించే మన దేశంలో ఆ మొక్కే మనిషి ప్రాణాన్ని ఒక్కో సారి కాపాడుతుంది. విశాఖపట్నం తుఫాను సృష్టించిన భీభత్సం గంటకి 200 పైగా కిలోమీటర్ల వేగంతో వీచే గాలులు మనిషి నీడని కూడా విశాఖలో తాకలేకపోయాయి అంటే దానికి కారణం చుట్టూ ఉన్న కొండలు, కొండల నిండా ఉన్న చెట్లు. తుఫాను దెబ్బని మొక్క తట్టుకొని మనిషిని కాపాడింది. మరి అలాంటి తుఫాను ధాటికి అమెరికా అస్తవ్యస్తం అయిపోతుంది. ఇలాంటి హారికేన్లు, తుఫాన్లు భారత్ లో ఎన్నో ఏళ్లకి ఒకసారి వస్తూ, పోతూ ఉంటాయి. కాని ఇండియాలో మనిషి మాత్రం ఏమీ చేయలేవు. అమెరికాని ఆదర్శంగా తీసుకొని అబివృద్ధి చెందిన ముంబాయ్ మహానగరం మొన్న భారీ తుఫాన్ దాటికి మొత్తం నీటిలో మునిగిపోయింది. వారం రోజులు ప్రజలు నీటిలో జీవనం సాగించే పరిస్థితి వచ్చింది, ఇక చెన్నైని ప్రతి ఏడాది ముంచే వరదలతో అక్కడి ప్రజలు ఎప్పుడు బిక్కుబిక్కుమంటూ బ్రతుకుతారు. మరి మైసూరు, వైజాగ్ పట్టణాలకి తాకని ప్రకృతి అరాచకం ఈ ముంబై, చెన్నై, హైదరాబాద్ వంటి మహానగారాలని ఎందుకు తాకుతుంది అనే విషయం తెలుసుకుంటే. ఇక అరాచకాన్ని తీసుకొచ్చే అభివృద్ధిని భారతీయ ప్రజలు గాని, ప్రభుత్వాలు గాని ఎప్పటికి ప్రోత్సహించరు.

Comments