ప్రచురణ తేదీ : Nov 29, 2017 8:25 PM IST

న్యూజిలాండ్ లో ముసుగు దొంగలతో పోరాడిన భారతీయుడు..!

ముసుగు దొంగలు చేసిన దాడిలో న్యూజిలాండ్ లో ఉంటున్న భారత వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. రక్తం ధారలుగా కారుతున్నా దొంగలతో అతడు పోరాడాడు. అజిత్ సింగ్ అనే భారతీయుడు న్యూజిలాండ్ లోని హామిల్టన్ లో డైరీ యజమానిగా వ్యాపారం చేస్తున్నాడు. అతడు దుకాణంలో ఉన్న సమయంలోనే నలుగురు దొంగలు దొంగతనానికి ప్రయత్నించారు. అజిత్ సింగ్ వారిని అడ్డుకోవడంతో అతడిపై దాడికి దిగి తీవ్రంగా గాయపరిచారు.

తనకు రక్తం తీవ్రంగా కారుతున్నా అజిత్ లెక్కచేయలేదు. దుండగలతో పోరాడి వారిని నిలువరించే ప్రయత్నం చేశాడు. అజిత్ సింగ్ ప్రతిఘటిస్తూనే ఉండడంతో దొంగలు ఖాళి చేతులతో వెళ్లిపోవాల్సి వచ్చింది. గాయపడ్డ అజిత్ సింగ్ ని ఆసుపత్రికి తరలించారు. కంటికి తీవ్రమైన దెబ్బ తగిలింది. ఇన్ఫెక్షన్ సోకె ప్రమాదం ఉండడంతో కాంతిని తొలగించాలని వైద్యులు సూచించారు. దీనితో అజిత్ సింగ్ తన కంటిని కోల్పోవలసి వచ్చింది. కేసు నమోదు చేసుకున్న పోలీస్ లు దుండగుల కోసం గాలింపు చేపడుతున్నారు.

Comments