అమెరికాలో భారత వైద్యుడు అరెస్ట్! ఎక్కడున్నా మనవాళ్ళ బుద్ధులు మారావా?

ప్రపంచంలో లైంగిక వేధింపులు, అత్యాచారాలు ఎక్కువగా జరిగే దేశాల్లో భారత్ కూడా ఒకటి ఇక్కడి ప్రజల ఆలోచనలు ఆడవారి మీద ఇంకా ఒకప్పటి భూర్జువ స్థాయిలో గూడు కట్టుకుపోయాయి. దీంతో ఆడవారి మీద ఆధిపత్యం చూపించాలని ఉద్దేశ్యంతో వారి మీద లైంగిక, మానసిక వేధింపులకి పాల్పడుతున్నారు. ఇండియాలో ఇలాంటి సంఘటనల్లో చట్టాలు చూస్తూ ఊరుకునే అవకాశం ఉందేమో కాని అమెరికాలో ఫిర్యాదు అందుకున్న మరుక్షణం అరెస్ట్ చేసేస్తారు. ఇప్పుడు అలా లైంగిక ఆరోపణల మీద అమెరికాలో భారత వైద్యుడు విజయ్ కుమార్ కృష్ణప్ప ని పోలీసులు అరెస్ట్ చేసారు. జులై 23న న్యూజెర్సీకి పయనమైన ఎయిర్ లైన్స్ విమానంలో తాను నిద్రించి ఉండగా కృష్ణప్ప అసభ్యంగా తనని తాకాడని 16 ఏళ్ల బాలిక ఆరోపించింది. అతని మీద ఎయిర్ లైన్స్ సిబ్బందికి ఫిర్యాదు చేసింది. ప్రయాణం అనంతరం ఆమె కుటుంబం అతని మీద పోలీసులకి ఫిర్యాదు చేసారు. అమెరిక దర్యాప్తు సంస్థ కృష్ణప్ప మీద కేసు నమోదు చేసి మైనర్ బాలికని వేధించిన కారణంగా అరెస్ట్ చేసినట్లు సమాచారం.

Comments