ప్రచురణ తేదీ : Tue, Sep 12th, 2017

పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకున్న భారత క్రికెటర్


ఏ నిమిషాన ఎలాంటి ప్రమాదం జరుగుతుందో ఎవ్వరికి తెలియదు. మనం జాగ్రత్తగా వెళుతున్నా ఎక్కడి నుంచి ఏ ప్రమాదం ఎదురవుతుందో ఊహించలేము. ఇక రోడ్డు ప్రయాణాలగురించి అయితే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సేఫ్ గానే డ్రైవింగ్ చేస్తున్నా టైమ్ బాలేకుంటే ఊహించని పరిణామాలు ఎదురవుతాయి. రీసెంట్ గా భారత క్రికెటర్ సురేష్ రైనాకు కు కూడా ఊహించని విధంగా ఓ ప్రమాదం ఎదురైంది. కానీ చాకచక్యంగా వ్యవహరించి ఆ ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు.

వివరాల్లోకి వెళితే.. కాన్పూర్ లోని దులీప్ ట్రోఫీలో ఇండియా బ్లూ జట్టుకు కెప్టెన్ గా ఉన్న రైనా మంగళవారం కాన్పూర్ కు తన రేంజ్ రోవర్ ఎస్ యూఏ కారులో వెళ్ళసాగాడు. అయితే మార్గం మధ్యలో ఎత్వాలోని ఫ్రెండ్స్ కాలనీ వద్ద టైరు పేలిపోయింది. దీంతో రైనా తొందరపడకుండా కారును స్లో చేసి రోడ్డుపక్కన ఆపేశాడు. అయితే ఒక్కసారిగా స్థానికులు కూడా అక్కడికి చేరుకున్నారు. పోలీసులు సమాచారం అందుకొని రైనాను అక్కడినుంచి సురక్షితంగా వేరొక వాహనంలో గమ్యానికి చేర్చారు.

Comments