రోబో సినిమాలో వశీకర్ ఉద్దేశ్యం అదే కదా? అయితే శంకర్ సక్సెస్!


శంకర్ దర్శకత్వంలో వచ్చిన రోబో సినిమాలో వశీకర్ పాత్రలో రజినీకాంత్ ఇండియన్ ఆర్మీకి రోబోలు ఇవ్వాలని ఆలోచనతో ఒక హ్యూమనాయిడ్ రోబో తయారు చేస్తాడు. అయితే ఆ రోబో సైన్యంలో ఉపయోగించడానికి పని రాదని అందులో విలన్ ఆ ప్రాజెక్ట్ జరగకుండా ఆపేస్తాడు. అయితే అప్పుడు శంకర్ కి వచ్చిన ఆలోచనని ఇప్పుడు ఇండియన్ ఆర్మీ ఆచరణలో పెట్టె ప్రయత్నం చేస్తుంది. అయితే ఆర్మీ ఈ రోబోలని కేవలం ఆయుధలని సైన్యంకి చేరవేయడానికి మాత్రమె ఉపయోగించనున్నట్లు సమాచారం. ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రతిపాదనలు రక్షణ శాఖ సిద్ధం చేసినట్లు సమాచారం. ప్రభుత్వం ఆమోదం లబించిన వెంటనే ఈ రోబోల తయారికి రంగం సిద్ధం చేయనున్నట్లు తెలుస్తుంది. ఉగ్రవాద నిరోధక చర్యల్లో ఈ రోబోల సేవలని వినియోగించుకోవాలని రక్షణ శాఖ భావించి ఈ ప్రతిపాదన సిద్ధం చేసినట్లు సమాచారం. అన్ని జరిగితే త్వరలో ఇండియన్ ఆర్మీలో రోబోలు కూడా తమ సేవలని అందిస్తాయి.

Comments