ప్రచురణ తేదీ : Dec 5, 2017 1:34 AM IST

ఢిల్లీ టెస్టు మ్యాచ్ మన పరువు సమస్య..!

క్రికెట్ చరిత్రలో ఈ మ్యాచ్ కు ఎదురుకాని సమస్య తొలిసారి ఢిల్లీ ఫిరోజ్ షా కోట్ల మైదానంలో జరుగుతున్న శ్రీలంక, భారత్ మూడో టెస్టుకు నెలకొంది. ఢిల్లీని పట్టి పీడిస్తున్న కాలుష్య భూతం క్రికెట్ మ్యాచ్ కు సైతం తగులుకుంది. దీనితో మిగిలిన రెండు రోజుల ఆటపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. మ్యాచ్ ఆగిపోతే బీసీసీఐ తో పాటు భారత్ కు కూడా ప్రతిష్టే. కనీసం క్రీడలు జరిగే పరిస్థితి కూడా ఇండియాలో లేదా అనే సందేహాలు మొదలవుతాయి. మరో వైపు హరిత ట్రిబ్యునల్ బీసీసీఐ పై మండి పడుతోంది.

ఢిల్లీలో కాలుష్య తీవ్రతని అంచనా వేయకుండా మ్యాచ్ ని ఎలా నిర్వహిస్తున్నారని హరిత ట్రిబ్యునల్ మండి పడుతోంది. ఒక వేళ కాలుష్య ప్రభావంతో మిగిలిన రెండు రోజుల ఆట కొనసాగకపోతే.. ఈ కారణం వలన నిలిచిపోయిన తొలి మ్యాచ్ ఇదే అవుతుంది. మ్యాచ్ లో ఆటగాళ్లు, స్టాండ్స్ లో ఉన్న టీం సిబ్బంది సైతం కాలుష్య ప్రభావంతో ఇబ్బంది పడుతూ కనిపించరు. అన్ని వైపుల నుంచి వస్తున్న ఒత్తిడితో బీసీసీఐ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

Comments