ప్రచురణ తేదీ : Thu, Oct 12th, 2017

వీడియో : మీడియా ప్రశ్నకు నవ్వు ఆపుకోలేకపోయిన ఆస్ట్రేలియా బౌలర్ !


మంగళవారం జరిగిన రెండవ టి 20 మ్యాచ్ లో భారత్ పై ఆస్ట్రేలియా జట్టు ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ తో జేసన్ ఒక్కసారిగా హీరోగా మారిపోయాడు. మొదట బ్యాటింగ్ చేసిన టీం ఇండియా కీలక వికెట్లు పడగొట్టింది ఇతడే. రోహిత్ శర్మ, కోహ్లీ, మనీష్ పాండే, ధావన్ ల వికెట్లు పడగొట్టి ఆసీస్ విజయంలో కీలక పాత్ర పోషించాడు.

మ్యాచ్ అనంతరం జేసన్ మీడియా సమావేశంలో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా భారత్ కు చెందిన విలేఖరి అడిగిన ఆసక్తికరమైన ప్రశ్నకు జేసన్ నవ్వు ఆపుకోలేకపోయారు. ప్రశ్న అడగగానే పగలబడి నవ్వేశాడు. ఇంతకీ ఆ ప్రశ్న ఏంటంటే.. మీరు అచ్చు ప్రొఫెషనల్ రెజ్లర్ జాన్ సీనా లా ఉంటారని అభిమానులు భావిస్తున్నారు. దీనితో జేసన్ ఒక్కసారిగా నవ్వేశాడు. ఈ విషయం మీదృష్టికి రాలేదా అని ప్రశ్నించగా.. లేదు అతడు నా కన్నా పెద్ద వాడు. ఆస్థాయికి చేరుకోవడానికి కష్టపడతా అని బదులిచ్చాడు.

Comments