ప్రచురణ తేదీ : Tue, Oct 10th, 2017

ధోని ఫస్ట్ టైమ్ అలా..టీమ్ ఇండియా ఓటమి..హైదరాబాద్ లో రిజల్ట్ !


తొలి టి 20 మ్యాచ్ లో ఆస్ట్రేలియా పై పూర్తి ఆధిపత్యం ప్రదర్శించిన టీం ఇండియా రెండవ టి 20 లో చతికిలబడింది. గువాహటి లోని బర్సాపర స్టేడియంలో జరిగిన తొలి అంతర్జాతీయ మ్యాచ్ ఇదే. మొదట బ్యాటింగ్ చేసిన టీం ఇండియా 118 పరుగులు మాత్రమే చేయగలింది. ఆ తరువాత బౌలింగ్ లో కూడా ఆకట్టుకోకపోవడంతో ఆసీస్ విజయం ఖరారైంది. దీనితో సిరీస్ 1-1 తో సమం అయింది. మూడు టి 20 మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా ఫలితం తేల్చే చివరి మ్యాచ్ హైదరాబాద్ లో శుక్రవారం జరగనుంది.

కాగా ఈ మ్యాచ్ లో ఎమ్ ఎస్ ధోని కెరీర్ లో తొలి సారి టి 20 ల్లో స్టంప్ అవుట్ అయి వెనుదిరగడం విశేషం. 80 టి 20 మ్యాచ్ లు ఆడిన ధోని తొలిసారి ఇలా వెనుదిరిగాడు. జంపా వేసిన బంతిని ముందుకు వచ్చి ఆడబోయిన ధోని స్టంప్ అవుట్ అయి వెనుదిరిగాడు.

Comments