త్వరలో నగదు కొరత తీరనుంది : కేంద్ర ప్రభుత్వం


గత కొద్దిరోజులుగా తెలుగు రాష్ట్రాల్లోనే కాక మరికొన్ని రాష్ట్రాలు నగదు కొరతతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే గత 24 గంటల్లో నగదు సరఫరా క్రమంగా పుంజుకుందని ఎస్బిఐ ప్రనిధులు తెలిపారు. ఏటీఎంల వద్ద నగదు కొరత కొన్ని ప్రాంతాలకే పరిమితమైందని పీఎన్‌బీ, కెనరా బ్యాంక్‌, యాక్సిస్‌ బ్యాంక్‌లు పేర్కొన్నాయి. గత 24 గంటల్లో ఎస్‌బీఐ ఏటీఎంల వద్ద నగదు లభ్యత మెరుగైందని, నగదు కొరత నెలకొన్న ప్రాంతాల్లోనూ నగదు సరఫరా పెంచేందుకు చర్యలు చేపడుతున్నామని, త్వరలోనే నగదు అందుబాటు సాధారణ స్థితికి చేరుకుంటుందని ఎస్‌బీఐ సీఓఓ నీరజ్‌ వ్యాస్‌ చెప్పారు.

మరోవైపు తమ ఏటీఎంల వద్ద నగదు లభ్యత మెరుగ్గా ఉందని, ఎలాంటి సమస్యలూ లేవని ప్రైవేట్‌ రంగ యాక్సిస్‌ బ్యాంక్‌ తెలిపింది. ఇతర బ్యాంకుల ఖాతాదారులు నగదు విత్‌డ్రా కోసం తమ ఏటీఎంలకు రావడంతోనే కొన్నిచోట్ల ఏటీఎంల్లో నగదు కొరత ఏర్పడిందని పేర్కొంది. ఇక కరెన్సీ కొరతను అధిగమించేందుకు అన్ని చర్యలూ చేపడుతున్నామని, తగినంత నగదు సరఫరా ఉందని ఆర్‌బీఐ స్పష్టం చేయగా రూ. 500 నోట్ల ముద్రణను ఐదు రెట్లు పెంచామని కేంద్రం తెలిపింది. తద్వారా కొంతవరకు నగదు కొరత తీర్చేలా ముందుకు వెళ్తున్నామని రిజర్వు బ్యాంకు అధికారి తెలిపారు. కాగా ఇది ఒకరకంగా ప్రజలకు తీపికబురేగా మరి…

Comments