ప్రచురణ తేదీ : May 30, 2018 12:00 AM IST

ఇకపై కలెక్షన్ల లెక్కల్లో తప్పులు లేకుండా ఓవర్సీస్ తరహా సిస్టం?


గత కొన్నాళ్లుగా మా సినిమాకి ఎక్కువ కలెక్షన్లు వచ్చాయంటే మా సినిమాకి వచ్చాయని హీరోల అభిమానులు ఇటీవల సోషల్ మీడియాల్లో గొడవలు పడుతూ ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్న విషయం తెలిసిందే. కొన్నాళ్ల క్రితం విడుదలయిన రంగస్థలం, భరత్ అనే నేను విషయంలో పోస్టర్లపై కలెక్షన్ల ఫిగర్లు వేయడంతో ఈ రగడ మరింత పెరిగి ఏ చిత్రానికి నిజానికి ఎంత కలెక్షన్ వచ్చింది, ఏ చిత్ర నిర్మాత చెప్పింది నిజం అనేది నమ్మడం సగటు ప్రజలకు కష్టతరంగా మారింది. అయితే ఇటీవల మెగా పవర్ స్టార్ రాంచరణ్ ఇకపై భవిష్యత్తులో తన రాబోవు చిత్రాల పోస్టర్ల పై కలెక్షన్ల తాలూకు ఫిగర్స్ వేయబోరని ప్రకటించారు. ఒకరకంగా కలెక్షన్ల విషయంలో ట్రాన్ఫరెసీ ఎందుకు ఉండడంలేదనిధి అంతుచిక్కని ప్రశ్నగా మారింది. అయితే రామ్ చరణ్ నిర్ణయం నిజంగా ఆహ్వానించదగ్గదని తెలుస్తోంది. ఇకపోతే రానున్న కొద్దిరోజుల్లో ఓవర్సీస్ కలెక్షల తరహాలో ఇక్కడ కూడా ఆ తరహా సిస్టం అమలుచేయనున్నట్లు సమాచారం.

నిజానికి ఇక్కడ మన థియేటర్లలో తీసుకునే టిక్కెట్లు అమ్మకాలకు అన్ని చోట్ల చాలావరకు కంప్యూటరైజ్డ్ పద్దతిని అనుసరిస్తున్నప్పటికీ ఫైనల్ కౌంటింగ్ విషయంలో మాత్రం సరైన క్లారిటీ లేకపోవడంతో ఇటువంటి లెక్కల సమస్యలు తలెత్తుతున్నాయని తెలుస్తోంది. అందుకే ఇప్పటికే ఓవర్సీస్ లో కలెక్షల లెక్కలను ఖచ్చితంగా తెలిపే రెంట్రాక్ సంస్థ త్వరలోనే ఇండియాలో కూడా తమ కార్యకలాపాలు నిర్వహించనుందని, ఆ దిశగా ఇప్పటికే చర్చలు కూడా మొదలయ్యాయి అని అంటున్నారు. ఒకవేళ ఇదే కనుక నిజమే అయితే ఇకపై సినిమాల కలెక్షన్ల విషయాల్లో ఖచ్చితత్వం వుండడమేకాక ఎటువంటి గొడవలు జరగవని సినీ విశ్లేషకులు అంటున్నారు….

Comments