ప్రచురణ తేదీ : Sun, Apr 1st, 2018

భాగ్యనగరంలో 30 రోజుల్లో 100 పార్కులు పూర్తి…

గ్రేట‌ర్ హైద‌రాబాద్ న‌గ‌ర వాసుల‌కు మ‌రింత మెరుగైన‌ జీవ‌న విధానం, ఆహ్లాద‌క‌ర‌మైన వాతావ‌ర‌ణం క‌ల్పించ‌డానికి గాను కొత్త‌గా వంద ఉద్యాన వ‌నాలు ఏర్పాటు చేయాల‌ని జీహెచ్‌ఎంసీ నిర్ణ‌యించింది. మ‌రో నెల‌ రోజుల్లో వంద పార్కుల నిర్మాణం పూర్తికానున్నాయి. 2017-18 ఆర్థిక సంవ‌త్స‌రంలో రూ. 5.40 కోట్ల వ్య‌యంతో 100 నూత‌న పార్కుల‌ను వివిధ కాల‌నీలు, బ‌స్తీల్లో ఏర్పాటు చేయ‌డానికి ప్ర‌ణాళిక‌లు రూపొందించి అమ‌లు చేసింది. దీనిలో భాగంగా నేటి వ‌ర‌కు 72 పార్కులు పూర్తై న‌గ‌ర‌వాసుల‌కు అందుబాటులోకి రాగా మిగిలిన 28 పార్కుల నిర్మాణాన్ని ఏప్రిల్ 30వ తేదీ లోగా పూర్తిచేయాల‌ని జీహెచ్ఎంసీ కమిష‌న‌ర్ ఆదేశించారు. ఈ వంద పార్కుల్లో అధిక శాతం కాల‌నీల‌లో నిర్మిస్తుండ‌డంతో పాటు నిర్మాణంలో సంబంధిత కాల‌నీ సంక్షేమ సంఘాలు వాటి నిర్మాణ ప‌నుల‌ను స్వ‌యంగా ప‌ర్య‌వేక్షిస్తున్నాయి. పూర్తి అయిన పార్కుల నిర్వ‌హ‌ణ‌ను మ‌రింత స‌మ‌ర్థ‌వంతంగా చేప‌ట్ట‌డానికి పార్కుల‌ను కాలనీ సంక్షేమ సంఘాల‌కు అప్ప‌గిస్తున్నారు. పార్కులో నుండి వ‌చ్చే ఆకుప‌చ్చ‌, వృక్ష సంబంధిత వ్య‌ర్థాల‌తో కంపోస్ట్ ఎరువుల త‌యారీకిగాను అదే పార్కులో కంపోస్ట్ పిట్‌ల‌ను నిర్వ‌హిస్తున్నారు. ఇక వ్యర్థ పదార్థాలను కూడా వేస్ట్ చేయకుండా పూర్తి ప్రణాలికలను సిద్దం చేసారు.
జీహెచ్ఎంసీలో ఉన్న పార్కుల వివ‌రాలు…
మేజర్ పార్కులు – 17
థీమ్ పార్కులు – 17
బ‌యోడైవ‌ర్సిటీ పార్కులు – 10
కాల‌నీ పార్కులు – 786
ట్రాఫిక్ ఐల్యాండ్స్ – 163
ఫ్లైఓవ‌ర్ల‌లో గ్రీన‌రీలు – 15
ట్రీ పార్కులు – 428
సంస్థాగ‌త పార్కులు – 12
చెరువుల వ‌ద్ద పార్కులు – 17
గ్రేవ్‌యార్డ్ గ్రీన‌రీలు – 20
వివిధ ప్రాంతాల్లో సిమెంట్ పాట్స్ ఏర్పాటు – 4,924
న‌ర్స‌రీలు – 45

Comments