ప్రచురణ తేదీ : Dec 6, 2017 7:52 PM IST

పిక్ టాక్‌ : యువ‌రాజు .. మా మంచి ప‌సోడు!!

పిల్ల‌ల ప్రేమ‌.. చెల్లెళ్ల‌ ప్రేమ‌.. ఆప్యాయ‌తానురాగాలు..
గుజ‌రాత్‌కి జై- జ‌యం క‌ల‌గాలి..
గుజ‌రాత్ వాసుల చిరు న‌వ్వు, ఖుషీగా ఉండే గుజ‌రాత్‌..
ఇలానే ఇక‌పైనా ఉండాలి.

….. ఇదీ కాంగ్రెస్ యువ‌నేత‌ రాహుల్ గాంధీ ఇచ్చిన సందేశం. గుజ‌రాత్ విజిటింగ్‌లో రాహుల్ గాంధీ ప‌ర‌వ‌శించి పోతూ అన్న మాట‌లివి. గుజ‌రాత్‌ని, గుజ‌రాత్‌లో ఉన్న భ‌విష్య‌త్ పౌరుల్ని ప్రేమిస్తున్నా, అభిమానిస్తున్నా అనే అర్థంలో రాహుల్ చేసిన వ్యాఖ్యానాలు ఆక‌ట్టుకున్నాయి. ఇక గుజ‌రాత్‌లో సంప్ర‌దాయ కుటుంబాలను రాహుల్ ప్ర‌శంసించారు. క్యూట్ క్యూట్ .. చ‌బ్బీ చ‌బ్బీ పిల్ల‌ల‌తో పిల్లాడిలా కలిసిపోయి ఫోటో ఎలా దిగాడో మీరే చూడండి. అంతా బాగానే ఉంది కానీ, రాహుల్ గాంధీ ఇప్ప‌టికీ ఎందుకు సీనియ‌ర్ బ్యాచిల‌ర్‌లా మిగిలిపోయాడో మాత్రం చెప్ప‌లేదు. ఒక‌వేళ అత‌డికి పెళ్ల‌యితే ఇంత‌మంది పిల్ల‌లు పుట్టేవారే.. అంటూ చూప‌రులు ఊహ‌ల్లో తేలిపోతున్నారంతే! యువ‌రాజు .. మా మంచి ప‌సోడు!! ప్చ్‌! వాటీజ్ దిస్ రాహుల్‌? ఎందుక‌లా చేశావ్‌?

Comments