ప్రచురణ తేదీ : Jul 12, 2018 4:20 AM IST

ఆయన మాటలకు ప్రాణం పోయినా బాగుండేది : మోత్కుపల్లి


సీనియర్ టిడిపి నేత, ఇటీవల ఆ పార్టీ నుండి బహిష్కరించబడ్డ మోత్కుపల్లి నర్సింహులు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మాటలు తనకు తీవ్ర ఆవేదనకు గురి అయ్యేలా చేశాయని వాపోయారు. నిన్న తిరుమల శ్రీ వేంకటేశ్వరుని దర్శనానికి కాలినడకన బయలుదేరిన మోత్కుపల్లి, కొండెక్కి సమయంలో తనకు అస్వస్థతగా ఉన్నప్పటికీ అలానే నడక కొనసాగించమని అన్నారు. తనకు మెట్లు ఎక్కడంతో ఒక్కసారిగా బిపి పెరిగి గుండెల్లో బాధగా వున్నా కానీ, స్వామి వారిని కలిసి తన గోడు చెప్పుకోవాలని మొక్కవోని దీక్షతో కొండకు చేరుకున్నాను అని అన్నారు. అక్కడ ఆయన మీడియాతో మాట్లాడుతూ, ముఖ్యమంత్రి చంద్రబాబు తనను కులం పేరుతో దూషించడం తనకు బాధ కలిగించిందని, పార్టీ కోసం ఎన్నో ఏళ్ళు పని చేసానని, తనకు దళితుల సంక్షేమమమే ద్యేయమని అన్నారు.

పార్టీలో వున్నపుడు తనకు ఆ పదవి ఇస్తాను, ఈ పదవి ఇస్తాను అంటూ ఆశ చూపిన చంద్రబాబు, తనకి తీరని ద్రోహం చేసారని, తనపై ఆయన చేసిన ఆరోపణలు వింటే, తన ప్రాణం పోయినా బాగుండేదని చెప్పుకొచ్చారు. ప్రస్తుతానికి తనకు ఏ పార్టీలో చేరాల్సిన అవసరం లేదని, తనకు అంత ఆసక్తి కూడా లేదని చెప్పారు. చంద్రబాబు వంటి మోసపూరిత నేత దేశంలోనే ఉండరని, నమ్ముకున్న ప్రజలను ఆయన నిలువునా ముంచారని, రానున్న రోజుల్లో తెలంగాణలో టీడీపీ వంటి పరిస్థితే ఏపీ టీడీపీకి కూడా పడుతుందని విమర్శించారు. తన కుటుంబంలోనివారు, తన అనునాయులకి మాత్రమే తప్ప, కష్టపడేవారికి, ప్రజలకు సంబందించిన విషయాలు ఆయనకు పట్టవని అన్నారు….

Comments