మోడీ అడ్డాలో రూ.871 కోట్ల నల్ల ధనం.. ఫోన్ నంబర్ తో పట్టేసిన ఐటి అధికారులు..!

money
దేశంలో నల్ల ధనాన్ని నిర్ములించాలని ప్రధాని నరేంద్ర మోడీ పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని తీసుకున్న విషయం తెలిసిందే. అయితే అది వికటించి ప్రజలకు, దేశానికి తీవ్ర నష్టం కలిగించిందని ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. కాగా నరేంద్ర మోడీ అడ్డా గుజరాత్ లోనే ఐటి అధికారులు భారీ నల్ల ధన కుంభకోణాన్ని వెలికి తీశారు. పెద్ద నోట్ల రద్దు తరువాత వెలుగు లోకి వచ్చిన అతిపెద్ద కుంభకోణం ఇదేమని అంటున్నారు. గుజరాత్ రాజ్ కోట్ లోని సహకార బ్యాంకులో నోట్ల మార్పిడి విషయంలో రూ 871 కోట్ల నల్ల ధనాన్ని ఇది అధికారులు బయటకు తీశారు.ఈ మొత్తాన్ని డిపాజిట్ చేయడం కోసం 4, 500 నకిలీ ఖాతాలను బ్యాంకు అధికారులతో కుమ్మకై తెరిచినట్లు ఐటి అధికారులు కనుగొన్నారు. ఇందులో 62 ఖాతాలకు ఒకే ఫోన్ నంబర్ ని ఉపయోగించడం విశేషం.

నోట్ల మార్పిడి విషయంలో సహకార బ్యాంకులో భారీ ఎత్తున అవకతవకలు జరిగాయని పసిగట్టిన అహమ్మదాబాద్ విభాగానికి చెందిన ఐటి అధికారులు రంగం లోకి దిగి ఈ వ్యవహారం మొత్తాన్ని బయట పెట్టారు. ఐటి అధికారులు విచారణలో భాగంగా రూ 871 కోట్ల పాత నోట్ల డిపాజిట్ లు నవంబర్ 8 తరువాత జరిగినట్లు గుర్తించారు. దీని కోసం ఫేక్ అకౌంట్ లను క్రియోట్ చేశారు. డిసెంబర్ 30 లోపు అందులో రూ 108 కోట్లను విత్ డ్రా చేసినట్లు ఐటి అధికారులు చెబుతున్నారు. బ్యాంకు అధికారుల కుమ్మక్కు తోనే ఇది సాధ్యమైందని అంటున్నారు. ఏడాదిలో 5 వేల అకౌంట్ లను ఓపెన్ చేసే వీలు ఉంటుంది. అలాంటిది నెల వ్యవధిలోనే 4500 ఖాతాలను ఓపెన్ చేశారని అధికారులు పేర్కొన్నారు. ఖాతాలను ఓపెన్ చేసే సమయం లో సదరు వ్యక్తి పాన్ నంబర్ కానీ, సంతకం కానీ తీసుకోలేదని, ఆదాయం ఎలా వచ్చిందో తెలిపే పాత్రలను కూడా సేకరించలేదని ఐటి అధికారుల విచారణలో తేలింది.

Comments