ప్రచురణ తేదీ : Nov 6, 2017 4:14 PM IST

హైదరాబాద్ మెట్రోలో హైలైట్స్ ఇవే..గెట్ రెడీ..!

నవంబర్ 28 న భాగ్యనగరంలో మెట్రో పరుగులు పెట్టనుంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ 28 న హైదరాబాద్ చేరుకొని తొలి విడత మెట్రో రైలుని ప్రారంభించనున్నారు. ముహూర్తం కుదరడంతో హైదరాబాద్ మెట్రో విశేషాలు కూడా బయటకు వస్తున్నాయి. మెట్రో రైలుకు సంబందించిన షెడ్యూల్ కూడా ఖరారైనట్లు తెలుస్తోంది. మెట్రో పై ప్రజల్లో ఆసక్తి నెలకొని ఉన్నా టికెట్టు ధర ఎంత ఉంటుంది ? టైమింగ్స్ ఏంటి ? అనే సందేహాలు నెలకొని ఉన్నాయి. వాటికి సంబందించి వివరాలు చూద్దాం..

*తెల్లవారు జామున 5 గంటల నుంచి అర్థ రాత్రి 12 గంటల మధ్యలో మెట్రో రైలు పరుగులు పెడుతుంది.
* 80 కిమీ వేగంతో ప్రయాణించే మెట్రో రైలు, ప్రతి స్టేషన్ లో 20 నుంచి 30 సెకన్ల పాటు రైలు ఆగుతుంది.
* ప్రతి స్టేషన్ లో షాపింగ్ జోన్ ఉంటుంది.
* మెట్రో స్టేషన్ వరకు చేరుకోవడానికి బస్సు సౌకర్యం కల్పిస్తున్నారు.
* మెట్రో రైల్ లో మొబైల్, మరియు లాప్ టాప్ ఛార్జింగ్ పెట్టుకునే సదుపాయం
* ఐదు నిమిషాలకు ఒక రైలుతో మొదట 57 మెట్రో రైళ్లని ప్రారంభించనున్నారు.
* దివ్యానుగులకు ప్రత్యేక సదుపాయాలు.
* టికెట్టు ధరపై మాత్రం క్లారిటీ లేదు. రూ 9 నుంచి 20 వరకు ఉండే అవకాశం ఉన్నట్లు అంచనా.

Comments