మెట్రో ఇబ్బందులు మొదలయ్యాయ?

నగర వాసులు ఎంతో కాలంగా ఎదురుచూసిన మెట్రో రానే వచ్చింది. హైదరాబాద్ ట్రాఫిక్ వల్ల విసిగిపోయిన జనాలు తక్కువ సమయంలో గమ్యాన్ని చేరుకోవడానికి ప్రస్తుతం మెట్రోలోనే వెళుతున్నారు. మొదటి రోజు లక్షల సంఖ్యలో జనాలు వారి ప్రయాణాలను కొనసాగించారు. అయితే ప్రస్తుతం ఎక్కువ మంది మెట్రో ప్రయాణం ఆస్వాదించడానికే వస్తున్నారు. మొదటి రోజు బాగానే సాగినా రెండవ రోజు నుంచి కష్టాలు మొదలయ్యాయి అని కొన్ని ఘటనలను చుస్తే మనకే అర్ధమవుతోంది. ప్రధాని మోడీ చేతుల మీదుగా ఎంతో ఘనంగా ప్రారంభమైన మెట్రో విషయంలో కొన్ని నిబంధనల గురించి తెలియకపోవడం అసలు కారణం.

అయితే ముఖ్యంగా రద్దీ చాలా వరకు పెరిగిపోయింది.దీంతో ఒక చోట దిగాల్సిన వారు మరొక చోట దిగడంతో డబ్బులు చెల్లించక తప్పలేదు. ఇక కొన్ని మెట్రో స్టేషన్స్ కి ఎక్కువగా పార్కింగ్ సౌకర్యం లేకపోవడంతో స్టేషన్ బయటే కొందరు ప్రయాణికులు వాహనాలను పార్క్ చేశారు. దీంతో ట్రాఫిక్ పోలీసులు ఆ వాహనాలను తీసుకెళ్లడంతో మళ్లీ ఫైన్లు కట్టక తప్పలేదు. ఇక బాత్రూమ్ లు తాగు నీరు వంటి సౌకర్యాలు లేకపోవడంతో కొందరు చాలా ఇబ్బందులకు గురయ్యారు. అంతే కాకుండా పరిమితికి మించి లగేజ్ ఉంటే అధికారులు అనుమతించలేదు. ఇక కొన్ని చోట్ల టికెట్ కౌంటర్లలోని కంప్యూటర్లు మొరాయించడం స్టార్ట్ చేశాయి. దీంతో ప్రయాణికులు ఇబ్బందులకు గురవ్వక తప్పలేదు.

Comments