ప్రచురణ తేదీ : Sat, Jan 7th, 2017

హైదరాబాదులో అక్కడ షాపింగ్ చేస్తే అన్నీ ఊరికే వచ్చినట్టే…?

central
హైదరాబాదులో కొన్ని షాపింగ్ మాల్స్ ఆఫర్లతో ఊదర గొడుతున్నాయి. కొన్ని రోజుల క్రితం బ్రాండ్ ఫ్యాక్టరీ పెట్టిన ఆఫర్లను స్వంతం చేసుకోవడానికి భాగ్యనగర వాసులు తెల్లవారుజామునుండే ఆ షాపుల ముందు క్యూలు కట్టారు. దీంతో బ్రాండ్ ఫ్యాక్టరీ షో రూంలు బయట సెక్యూరిటీ లను ఉంచి ఒక్కొక్కరిగా లోపలకు పంపారు. ఇప్పుడు బ్రాండ్ ఫ్యాక్టరీ ఆఫర్లు అయిపోయాయి కానీ మళ్ళీ హైదరాబాద్లో ఇలాంటి ఆఫర్లనే ఇస్తుంది పంజాగుట్ట లోని “హైదరాబాద్ సెంట్రల్ మాల్”. దీంతో హైదరాబాద్ వాసులు సెంట్రల్ ముందు క్యూలు కట్టారు.

ఎనిమిది వేల షాపింగ్ చేస్తే నాలుగు వేలే చెల్లించడం, ఆ నాలుగు వేలు కూడా కూపన్లు, ఇతరత్రా క్యాష్ బ్యాక్ వస్తుండడంతో ప్రజలంతా సంక్రాంతికి షాపింగ్ చేసేస్తున్నారు. ఈ ఆఫర్ కేవలం శుక్రవారం నుండి ఆదివారం వరకు అని ప్రకటించడంతో నిన్న ఉదయం నుండి ప్రజలు సెంట్రల్ ముందు బారులు తీరారు. ట్రాఫిక్ ప్రదేశం మొత్తం నిండిపోవడంతో రోడ్లపైనే వాహనాలు నిలిపి షాపింగ్ చేసుకున్నారు. దీంతో ఆ ప్రాంతంలో విపరీతమైన ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ నివారించడానికి ఎంత ప్రయత్నించినా ఫలితం లేదు. ఉదయం 10 గంటల నుండి రాత్రి 7 గంటల వరకు ట్రాఫిక్ జామ్ ఏర్పడి వినియోగదారులు చాలా ఇబ్బందులు పడ్డారు.

Comments