ప్రచురణ తేదీ : Thu, Oct 12th, 2017

సూసైడ్ చేసుకున్న బీటెక్ గర్ల్.. వాట్సాప్‌లో స్టేటస్‌

క్షణికావేశంలో కొందరు తీసుకునే నిర్ణయాలు దారుణంగా ఉంటాయి. ఏ మాత్రం ఆలోచించకుండా ఒక్క నిమిషంలో తీసుకునే నిర్ణయం ఒక కుటుంబాన్ని తీవ్ర విషాదంలో నింపుతుంది. రీసెంట్ గా ఇదే తరహాలో ఒక దారుణమైన ఘటన చేసుకుంది. చిన్న గొడవ కారణంగా బిటెక్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకోవడం సంచలనంగా మారింది. అదే విధంగా ఆమె చనిపోయేటప్పుడు వాట్సప్ లో స్టేటస్ పెట్టి మరి ఆత్మహత్యకు పాల్పడింది.

తీవ్ర కలకలం సృష్టించిన ఈ ఘటన హైదరాబాద్ లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన చంద్రం, రేణుక అనే దంపతులు 20 ఏళ్ల క్రితం నగరానికి వచ్చి సూరారం లో నివాసం ఉంటున్నారు. వారికి మనస్పర్థలు రావడంతో విడిగా ఉంటున్నారు. అయితే కూతురు మౌనిక మరియు కొడుకు తల్లితోనే ఉండసాగారు. మౌనిక నరసింహారెడ్డి ఇంజనీరింగ్‌ కాలేజిలో బీ.టెక్‌ ఫైనలియర్‌ చదువుతోంది.

అయితే బుధవారం అర్ధరాత్రి మౌనిక తను సంతోషంగా బ్రతకడం ఎవ్వరికి ఇష్టం లేదని చూసి ఓర్వలేక పోతున్నారని వాట్సాప్ స్టేటస్ పెట్టి ఉరివేసుకొని ప్రాణాలను తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే మౌనిక చనిపోయే ముందు తన తమ్ముడితో గొడవపడినట్లు తల్లి రేణుక చెప్పింది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణను కొనసాగిస్తున్నారు.

Comments