ప్రచురణ తేదీ : Nov 29, 2017 11:55 PM IST

రెండవ రోజే రికార్డు కొట్టిన హైదరాబాద్ మెట్రో !

ఏళ్ల తరబడి హైదరాబాద్ ప్రజలు ఎదురుచూస్తున్న మెట్రో రైలు నిన్న ప్రధాని మోడీ చేతులమీదుగా లాంచ్ అయింది. ప్రజలంతా మెట్రో కోసం ఆసక్తిగా ఎదురుచూసారు. ఎట్టకేలకు మెట్రో బండి కదలడంతో నగరవాసుల ఆనందానికి అవధులు లేకుండా పోయింది. మెట్రోకు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోందని మెట్రో ఎండి ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. ఈ రోజు రాత్రి వరకు రికార్డు స్థాయిలో లక్ష మంది ప్రయాణించే అవకాశం ఉందని ఆయన అన్నారు.

సెంట్రల్ మెట్రో యాక్ట్ కింద భారత ప్రభుత్వమే మెట్రో టికెట్ ధరల్ని నిర్ణయిస్తుందని తెలిపారు. మెట్రోలో మరిన్ని సాంకేతిక పనులు జరగాల్సి ఉందని అన్నారు. పార్కింగ్ పనులని నెలరోజుల్లో పూర్తి చేస్తామని ఆయన అన్నారు. కాగా మెట్రో రైలులో సరదాకైనా ప్రయాణించాలని యువత ఉత్సాహం చూపిస్తున్నారు. కాగా మెట్రో చార్జీలు కాస్త అధికంగా ఉన్నాయనే అసంతృప్తి కొన్ని వర్గాల ప్రజల్లో నెలకొని ఉంది.

Comments