ప్రచురణ తేదీ : Tue, Sep 12th, 2017

జగన్ కి రూ 50 కోట్లు దండగ ఖర్చు..?


ఆంధ్రప్రదేశ్ రాజకీయాలంటే ఇప్పుడు కేవలం వైసిపి, టిడిపి మధ్య పోరుగానే అంతా చూస్తున్నారు. కాకినాడ, నంద్యాల ఎన్నికలకు ముగిసినా ఆ చర్చ ఇంకా జరుగుతూనే ఉంది. దానికి కారణం ఎన్నికలల్లో వెలువడిన ఫలితాల గురించి ఆ రెండు పార్టీలు పరస్పరం విమర్శలు చేసుకుంటుండడమే. వచ్చే ఎన్నికల నాటికి తనని అధికారం లోకి తీసుకుని వచ్చే సలహాలు సూచనల కోసం జగన్ రాజకీయ వ్యూహ కర్త ప్రశాంత్ కిషోర్ ని నియమించుకున్నారు. వైసిపి ప్లినరీ వేదికగా ప్రశాంత్ కిషోర్ ని ఏపీ ప్రజలకు జగన్ పరిచయం చేశారు. కానీ ప్రశాంత్ కిషోర్ ఇచ్చిన సలహాలు జగన్ కు ఈమేరకు ఉపయోగ పడ్డాయనేదే ఇక్కడి ప్రశ్న. కానీ ప్రశాంత్ కిషోర్ రెమ్యునరేషన్ మాత్రం బాగా ముట్టినట్లు తెలుస్తోంది. జగన్ ప్రశాంత్ కిషోర్ కి రూ 50 కోట్లు ఇచ్చారట. అంత ఖర్చు పెట్టి సలహా దారుడిని నియమించుకున్నా జగన్ కి ఎటువంటి ఉపయోగం లేకుండా పోతోందనే సెటైర్లు వినిపిస్తున్నాయి.

ఈ మేరకు టీడీపీ నేతల్లో జరిగిన చర్చలలో ప్రశాంత్ కిషోర్ గురించి జోకులు పేలాయి. నంద్యాల ఉపఎన్నిక విజయం గురించి టీడీపీ నేతలు చర్చించుకున్నారట. మంత్రులు ఆదినారాయణ రెడ్డి, పత్తి పాటి పుల్లారావు, ఎమ్మెల్యే ఆమంచి మోహన కృష్ణ మధ్య ఆసక్తికరమైన చర్చ జరిగినట్లు తెలుస్తోంది. జగన్.. ప్రశాంత్ కిషోర్ కు పారితోషకంగా రూ 50 కోట్లు ఇచ్చారనే వార్తల గురించి వారిమధ్య చర్చ జరిగింది. ప్రశాంత్ కిషోర్ కే రూ 50 కోట్లు ఇస్తే.. టీడీపీ గెలిచేలా కష్ట పడ్డ తమకి అధినేత చంద్రబాబు రూ 100 కోట్లు ఇవ్వాలని సరదాగా ఆదినారాయణ రెడ్డి వ్యాఖ్యానించారు. మొత్తం 16 మంది నేతలు నంద్యాల బై ఎలక్షన్ కోసం పనిచేశారు. వారందరికీ ఆ 100 కోట్లు సమానంగా పంచాలని చమత్కరించారు. ఆదినారాయణ రెడ్డి నంద్యాల ఉపఎన్నిక సందర్భంగా కీలక పాత్ర వహించారు. వైసిపి కి తిరుగు లేదని భావించిన గోస్పాడు నియోజకవర్గాన్ని టేక్ ఓవర్ చేసింది ఆయనే. అనూహ్యంగా గోస్పాడులో కూడా టీడీపీ మంచి మెజారిటీ సాధించింది.

Comments