ఫోటో టాక్ : ఈ దుస్తుల యాడ్ కాకరేపుతోందిగా..!

జాతి వివక్ష గురించి మాటెత్తితే చాలు.. సామజిక వాదులు ఉడుకెత్తిపెతున్నారు. అలాంటి పరిస్థితుల్లో తెల్ల, మరియు నల్ల జాతీయుల మధ్య చిచ్చు పెట్టేలా ఉంది ఈ దుస్తుల ప్రకటన. ప్రస్తుత సమాజంలో ప్రకటనల విషయంలో కంపెనీలు ప్రమాణాలు పాటించడం లేదనే విషయం అందరికి తెలిసిందే. ఇక ఆయా బ్రాండ్ లకు ప్రచారం కల్పిస్తున్న వారు కూడా డబ్బు గురించే ఆలోచిస్తున్నారు తప్ప నాణ్యత పట్టించుకోవడం లేదు. కానీ ఈ దుస్తుల యాడ్ లో చిన్న పిల్లల్ని ఉపయోగించారు.

స్వీడిష్ గార్మెంట్ కంపెనీ బ్రిటన్ లో అమ్మకాల కోసం హెచ్ అండ్ ఎమ్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. వీటి ప్రచారం కోసం డిజైన్ చేసిన యాడ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. నల్ల జాతికి చెందిన బాలుడు, తెల్ల జాతికి చెందిన బాలుడు ధరించి ఉన్న స్వెటర్ లు ఈ వివాదానికి కారణం. నల్ల జాతి బాలుడు ధరించి ఉన్న స్వెటర్ పై కూలెస్ట్ మంకీ ఇన్ ది జంగిల్ అని రాసి ఉంది. తెల్లజాతి బాలుడు ధరించిన స్వెటర్ పై వారు గొప్పవారు అని అర్థం వచ్చేలా ఉంది. అతడు ధరించిన స్వెటర్ పై పులి బొమ్మ ఉండడం విశేషం. ఈ వ్యవహారం తీవ్రమైన వివాదంగా మారడంతో నల్ల జాతీయుల నాయకులు ఆందోళన మొదలు పెట్టారు.

Comments