ప్రచురణ తేదీ : Sep 19, 2016 10:55 PM IST

ఏం చేద్దాం పాక్ ని.. యురి పై మోడీ ఆరా..!

modi-meeting
భారత ప్రధాని నరేద్రమోడీ సోమవారం యురి ఘటన పై సమీక్ష నిర్వహించారు.తన అధికారిక నివాసం లో సోమవారం ఉదయం 7 మంది కేంద్రమంత్రులు, పలువురు అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు.జమ్మూకాశ్మీర్ లో యురి సైనిక స్థావరంపై ఉద్రవాదులు దాడి చేసిన సంగతి తెలిసిందే.ఈ దాడిలో 20 మంది సైనికులు మరణించారు. భారత సైనికులు వారిలో నలుగురు ముష్కరులను అంతం చేశారు.

ఈ విషయాన్ని కేంద్రం తీవ్రంగా పరిగణిస్తోంది.కేంద్ర హోమ్ మంత్రి రాజ్ నాథ్, రక్షణ మంత్రి మనోహర్ పారికర్, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తదితరులు ఈ సమావేశం లో పాల్గొన్నారు.ఈ ఘటన పై ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న దానిపై వారు ప్రధానితో చర్చించారు.ఈ ఘటనని యావత్ భారత దేశం ముక్త కంఠంతో ఖండించింది.

Comments