అరకులో హై అలర్ట్ !

విశాఖ మన్యంలో జరిగిన మావోయిస్టుల చేతిలో మృతి చెందిన అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు మాజీ ఎమ్మెల్యే సీవేరు సోము హత్యలకు నిరసనగా డుంబ్రిగూడ పోలీస్ స్టేషన్ ఫై గిరిజనులు దాడి చేశారు. పోలీసుల నిర్లక్ష్యమే ఈ ఘటనకు కారణమని ఆగ్రహించిన గిరిజనులు పోలీస్ స్టేషన్లోని ఫర్నిచర్ తోపాటు స్టేషన్ ఆవరణలోని పర్ణశాలకు నిప్పు పెట్టారు. అడ్డుకున్న పోలీసులపై స్థానికులు దాడికి దిగడంతో పోలీసులు కూడా ప్రాణ భయంతో పరుగులు తీశారు.

ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వర్రావు, మాజీ ఎమ్మెల్యే సోమ మృత దేహాలతో స్థానికులు స్టేషన్‌ వద్ద ఆందోళనకు దిగడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఆందోళనకారులను అదుపు చేయడానికి విశాఖ నుంచి ప్రత్యేక పోలీసు బలగాలు డుంబ్రిగూడ చేరుకుంటున్నాయి. ఇక ఈ దాడి ఘటనపై స్పందించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజలు సంయమనం పాటించాలని కోరారు. ప్రస్తుతం ఆయన అమెరికా పర్యటనలో వున్నారు.

Comments