ప్రచురణ తేదీ : Jan 5, 2018 2:55 AM IST

రజినీకాంత్ కు మద్దతుగా మరో హీరో!

తమిళ్ రాజకీయాల్లో ఎవరు ఊహించని విధమమైన పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. మొన్నటి వరకు ఆర్కే నగర్ ఉప ఎన్నికలు హాట్ టాపిక్ అయిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు రజినీకాంత్ ఎంట్రీ ఇచ్చి మరొక షాక్ ఇచ్చాడు. ఫైనల్ గా ఆయన రాజకీయాల్లోకి అడుగు పెడుతున్నా అని చెప్పకనే చెప్పేశాడు. ఇక తన బలాన్ని తెలుసుకోవడానికి తైలవా ఆన్ లైన్ ద్వారా ప్రజల మద్దతు కోరగా ఆయనకు ఒక్క రోజులోనే లక్షల సంఖ్యలో అభిమానులు మద్దతు పలికారు.

ఇప్పటికి ఆ సంఖ్య పెరుగుతూ వస్తోంది. దీంతో రజినీకి సపోర్ట్ గా కోలీవుడ్ సినీ ప్రముఖులు కూడా నిలుస్తున్నారు. ఇటీవల రాఘవ లారెన్స్ రజినీకి మద్దతు ఇస్తానని చెప్పాడు. అంతే కాకుండా ఎన్నికల్లో లారెన్స్ పోటీ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇక అదే తరహాలో హీరో విశాల్ కూడా రజినీకాంత్ కు మద్దతు ఇస్తున్నట్లు చెప్పాడు. రజినీ పోటీ చేస్తే 234 స్థానాల్లో ప్రచారం చేస్తానని విశాల్ తెలిపాడు. ఒక కార్యకర్తగా మాత్రమే పనిచేస్తాను అని వివరించాడు. ఇక ఇటీవల జరిగిన ఆర్కే నగర్ ఉప ఎన్నికల్లో విశాల్ పోటీ చేయాలనీ అనుకున్నాడు. కానీ ఎన్నికల కమిషన్ అతని నామినేషన్ ని తీరస్కరించింది. దీంతో ఆయన దినకరన్ కు మద్దతు పలుకగా అతను విజయాన్ని అందుకున్నాడు.

Comments