ప్రచురణ తేదీ : Dec 8, 2017 1:00 AM IST

జగన్ ని సినిమా ప్రమోషన్ కోసం వాడేస్తున్నాడే..!

హీరో సుమంత్ కెరీర్ ప్రస్తుతం పెద్ద జోష్ లో లేదు. అక్కినేని కుటుంబం నుంచి వచ్చిన సుమంత్ కు కెరీర్ ఆరంభంలో పరవాలేదనిపించే కొన్ని హిట్లు ఉన్నాయి. కానీ ఆ తరువాత ఈ హీరో కెరీర్ ట్రాక్ తప్పింది. వరుసగా ప్లాప్స్ రావడంతో అడపాదడపా మాత్రమే వెండితెరపై మెరుస్తున్నాడు. తాజాగా సుమంత్ నటించిన చిత్రం ‘మళ్లీ రావా’. ఆ మద్యన విడుదలైన ట్రైలర్ తో మంచి అంచనాలనే సొంతం చేసుకుంది.

శుక్రవారం ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. దీనితో సుమంత్ ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా గడుపుతున్నాడు. ఓ ఇంటర్వ్యూ సందర్భంగా సుమంత్.. వైఎస్ జగన్ తో ఉన్న చిన్ననాటి స్నేహాన్ని గుర్తుచేసుకున్నాడు. స్కూల్ లో ఇద్దరం బాగా అల్లరి చేసేవాళ్ళం అని సుమంత్ అన్నాడు. ఇప్పుడు ఎవరి పనుల్లో వాళ్ళు బిజీ అయ్యాక రెగ్యులర్ గా కలుసుకోవడం లేదని అన్నారు. జగన్ ని చివరగా రెండేళ్ల క్రితం కలిశానని అన్నారు. ఇప్పుడు ఆయన రాజకీయాల్లో బిజీగా ఉన్నారు. నేను సినిమాల్లో బిజీ అయిపోయానంటూ జగన్ తో స్నేహాన్ని గుర్తు చేసుకున్నారు.

Comments