ప్రచురణ తేదీ : Sun, Aug 13th, 2017

బిగ్ బాస్ లోకి మరో హీరో


తెలుగు బిగ్ బాస్ షో అనుకున్నట్లుగానే టాప్ రేటింగ్ తో దూసుకుపోతోంది. మొదట్లో కాస్త డల్ గా అనిపించినా రోజు రోజుకి పార్టిసిపేట్స్ మధ్య వివాదాలు, అల్లర్లు జనాలను బాగానే ఆకట్టుకుంటున్నాయి. ఇక దానికి తోడు జూనియర్ ఎన్టీఆర్ యాంకర్ గా మరో స్థాయికి తీసుకెళ్లాడనే చెప్పాలి.

అయితే బిగ్ బాస్ షోలో వారానికి ఒకరు ఎలిమినేటి అవుతుండడం ప్రేక్షకుల్లో ఇప్పుడు మరింత ఆసక్తిని రేపింది. అలాగే మరి కొంత మంది వైల్డ్ కార్డు ద్వారా ఎట్రీ ఇస్తుండడం కూడా షోకి రేటింగ్ ని బాగానే పెంచుతోంది. కొన్ని రోజుల క్రితం గోపాల గోపాల సినిమా ఫేం దీక్షా పంత్‌ బిగ్‌బాస్‌ హౌస్ లో అడుగు పెట్టడంతో కాస్త గ్లామర్ పెరిగింది అంటున్నారు వీక్షకులు. ఇక ఇప్పుడు మారో హీరో రాబోతున్నాడని టాక్ వినిపిస్తోంది. టాలీవుడ్ లో హీరోగా, విలన్ గా మెప్పిస్తున్న నవదీప్ ని తీసుకురాబోతున్నట్లు సమాచారం. మరి ఈ యువ హీరో వచ్చిన తర్వాత షో ఇంకా ఏ రేంజ్ లో హిట్ అవుతుందో చూడాలి.

Comments