ప్రచురణ తేదీ : Dec 29, 2016 2:10 AM IST

కోడి పందేలను ఆపం అంటున్న గోదావరి జిల్లా వాసులు

hens
కోడి పందేలను ఆపండి అని హై కోర్టు ఇచ్చిన ఆదేశాలపై సుప్రీమ్ కోర్టుకు వెళ్లాలని కోడి పందేలు నిర్వాహకులు యోచిస్తున్నట్టు సమాచారం. ఎన్నోఏళ్లుగా సంప్రదాయంగా వస్తున్న కోడి పందేలను ఆపుతామంటే చూస్తూ ఊరుకోమని వాళ్ళు అంటున్నారు. ఈ విషయంపై తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలకు చెందిన రాజకీయ నాయకులు కూడా కోడి పందేల నిర్వాహకులతో చేతులు కలుపుతున్నారు.

హై కోర్ట్ ఆదేశాలపై సుప్రీమ్ కోర్టుకు వెళతానన్న బీజేపీ నేత రఘు రామకృష్ణంరాజుకు వీరందరూ మద్దతు తెలపాలి అనుకుంటున్నారు. కోడి పందేల నిర్వాహకుల్లో ఒకరైన కాశీరాజు, నడింపల్లి శ్రీనివాసరాజు విలేకరులతో మాట్లాడుతూ.. సుప్రీమ్ కోర్టుకు వెళ్లే వారికీ పూర్తిగా సహకరిస్తామని, కోడి పందేలు సజావుగా సాగేందుకు, పండుగ సంబరాలు రెట్టింపు చేసేందుకు సహకరించాలని ముఖ్యమంత్రిని, ఎమ్మెల్యే లను కోరతామని తెలిపారు. జీవహింస కోణంలో పందేలు వద్దు అంటే మరి రోజూ కొన్ని లక్షల కోళ్లను ఆహరం కోసం చంపడం లేదా అని వారు ప్రశ్నించారు.

Comments