ప్రచురణ తేదీ : Tue, Oct 10th, 2017

హైదరాబాద్ రైన్స్ : కష్టం కాదు నరకయాతన ఇది.. అతలాకుతలమైన భాగ్యనగరం !


హైదరాబాద్ లో చిన్నపాటి జల్లులు కురిస్తేనే రోడ్లన్నీ జలమయంగా మారుతాయి. అలాంటిది ఒక్కసారిగా భారీ వర్షం కురిస్తే పరిస్థితి ఎలా ఉంటుందో మన ఊహకి కూడా అందదు. అలాంటి పరిస్థితే నేడు వాహనదారులకు ఎదురైంది. నేటి సాయంత్రం మొదలుకుని వర్షం భారీ గా కురవడంతో హైదరాబాద్ లోని పలు ప్రాంతాలు జలమయంగా మారాయి. హైటెక్ సిటీ, మాదాపూర్, మైండ్ స్పేస్ వంటి ప్రాంతాల్లో భారీ వర్షం కురవడంతో తీవ్రమైన ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.

జూబ్లీ హిల్స్ నుంచి మాదాపూర్ కు వెళుతున్న తాను 2 గంటలుగా ట్రాఫిక్ లో చిక్కుకు పోయానని, మరో 2 గంటల సమయం పట్టవచ్చని సినీ దర్శకుడు కొరటాల శివ సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారంటే పరిస్థితి ని అర్థం చేసుకోవచ్చు. గంటల తరబడి ట్రాఫిక్ లో నిరీక్షించలేని కొందరు రోడ్ల పక్కనే వాహనాల్ని నిలిపివేశారు. సైబర్ టవర్స్ వద్ద ట్రాఫిక్ సిగ్నల్ పనిచేయకపోవడంతో మాదాపూర్ పోలీస్ స్టేషన్ వరకు భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది.

ట్రాఫిక్ లో చిక్కుకుపోయిన ప్రజలు మరియు ఇతరులు ఈ క్రింది విధంగా సోషల్ మీడియాలో వారి అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.

Comments