ప్రచురణ తేదీ : Thu, Oct 12th, 2017

స్థంభించిన హైదరాబాద్..ఆఫీసుల నుంచి వెళ్లే వారి పరిస్థితి..!


సాయంత్రం నుంచి కుండపోతగా కురుస్తున్న వర్షంతో హైదరాబాద్ నగర రోడ్లన్నీ సముద్రాలని తలపిస్తున్నాయి. ఎక్కడి కక్కడ వాహనాలు నిలిచిపోవడంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. సాయంత్రం ఆరున్నరకు భారీ వర్షం మొదలు కావడంతో ట్రాఫిక్ కి అంతరాయం ఏర్పడింది. ఆఫీసుల నుంచి ఇంటికి వెళ్లేవారు రెండుగంటల పేరు ప్రయాణాన్ని వాయిదా వేసుకోవాలని ట్రాఫిక్ డిసిపి రంగనాథ్ సూచించారు. అంతా ఒకేసారి వాహనాల్లో బయలుదేరితే ట్రాఫిక్ జామ్ మరింత జఠిలంగా మారె అవకాశం ఉందని ఆయన అన్నారు.

రెండు రోజుల క్రితం కురిసిన వర్షంతో హైటెక్ సిటీ మొత్తం ట్రాఫిక్ స్థంభించిన విషయం తెలిసిందే. మరోమారు మళ్లీ వరుణుడు ప్రతాపం చూపాడు. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మెహిదీపట్నం, పంజాగుట్ట లలో కుండపోత వర్షం కురుస్తోంది. అమీర్ పెట్, ఎస్ ఆర్ నగర్, సనత్ నగర్ కూకట్ పల్లి మరియు ఇతర ప్రాంతాలలో భారీ వర్షం కురుస్తోంది.

నగరవాసులు వర్షం వలన ఎదుర్కొంటున్న ఇబ్బందులని సోషల్ మీడియాలో ఈ విధంగా వ్యక్తపరుస్తున్నారు.

Comments