వీడియో : కూతుర్ని ఒళ్లో కూర్చోబెట్టుకుని వార్తలు చదివిన యాంకర్ !

న్యూస్ ఛానల్ లో యాంకర్ గా పనిచేస్తున్న ఆ మహిళ సమాజంలో జరిగిన ఓ ఘోరాన్ని దుయ్యబట్టేందుకు విన్నూత్నంగా వార్తలు చదివింది. తన బుల్లి కూతురిని ఒళ్ళో కూర్చోబెట్టుకుని వార్తలు చదవడం విశేషం. ఆ యాంకర్ ఎందుకలా చేసిందో తెలుసుకునేందుకు వివరాల్లోకి వెళదాం…

పాకిస్థాన్ కు చెందిన ఆ మహిళా సమా టివి లో న్యూస్ రీడర్ గా పనిచేస్తోంది. ఇటీవల ఓ బాలికని దుండగులు అతిదారుణంగా హత్య చేసి మృతదేహాన్ని విధుల్లో పడేశారు. ఈ ఘటన గురించి వివరిస్తూ తన కుమార్తెని ఒళ్లో కూర్చో బెట్టుకుని వార్తలు చదివింది. నేను ఈ రోజు న్యూస్ యాంకర్ గా రాలేదు. భాద్యత కలిగిన ఓ తల్లిగా వచ్చాను. ఓ బాలికపై అత్యంత క్రూరంగా ప్రవర్తించి మానవత్వానికి అంత్య క్రియలు జరిపారని ఆవేదన వ్యక్తం చేసింది. ఇటువంటి కేసులు పునరావృతం కాకుండా పోలీస్ లు ఎందుకు సరిగా పని చేయలేకపోతున్నారని ఆరోపించింది. సదరు యాంకర్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.

Comments