ప్రచురణ తేదీ : Jan 11, 2018 11:00 AM IST

హార్దిక్ పాండ్యా ప్రేమలో పడ్డాడా?

ప్రస్తుతం చాలా వరకు సెలబ్రెటీలలో ప్రేమ వివాహాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఇండియన్ టీమ్ క్రికెటర్స్ కి అలాగే బాలీవుడ్ భామలకు మధ్య కొంచెం పరిచయాలు ఎక్కువవుతున్నాయని తెలుస్తోంది. ఇటీవల విరాట్ కోహ్లీ అనుష్క ల వివాహం ఏ రేంజ్ లో జరిగిందో అందరికి తెలిసిందే. ఇద్దరు కొన్నేళ్ల వరకు డేటింగ్ లో ఉండి ఆ తరువాత వివాహం చేసుకున్నారు. అయితే అదే తరహాలో జట్టులోని కీలక ఆటగాడిగా ఉన్న హార్దిక్ తో ఒక బాలీవుడ్ నటి డేటింగ్ చేస్తున్నట్లు బాలీవుడ్ లో టాక్ గట్టిగా వినిపిస్తోంది.

ఆమె ఎవరో కాదు నటి ఎల్లి అవ్రామ్ అని ప్రచారం జరుగుతోంది. బిగ్ బాస్ 7 సిరీస్ లో పాల్గొన్న ఎల్లి పలు బాలీవుడ్ చిత్రాల్లో నటించి తనకంటూ ఒక మంచి గుర్తింపును తెచ్చుకుంది. అలాగే కన్నడ తమిళ సినిమాల్లో కూడా ఈ బ్యూటీ నటించింది. ఇకపోతే ఎల్లి గత కొంత కాలంగా పాండ్యా తో సన్నిహితంగా ఉన్నట్లు రూమర్స్ వస్తున్నాయి. అందుకు సంబందించిన న్యూస్ కూడా ఇప్పుడు బాలీవుడ్ మీడియాలో వైరల్ అవుతోంది. అంతే కాకుండా ఆమె క్రునల్ పాండ్యా పెళ్లికి హాజరుకావడం అలాగే పెళ్లిలో హార్దిక్ తో కలిసి సన్నిహితంగా ఫొటోలు దిగడం హాట్ టాపిక్ అయ్యింది. దీంతో వారిద్దరి మధ్య డేటింగ్ నడుస్తోందని ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియదు గాని పాండ్యా నుంచి మాత్రం ఎటువంటి వివరణం లేకపోవడం గమనార్హం.

Comments