ప్రచురణ తేదీ : Mon, Sep 11th, 2017

వీడియో : ఆండర్సన్ 500వ వికెట్ పడింది..కొత్త ప్రేమ చిగురించింది..!


వెస్టిండీస్ తో జరుగుతున్న సిరీస్ లో ఇంగ్లాండ్ స్టార్ బౌలర్ జేమ్స్ అండర్సన్ టెస్టుల్లో 500 వికెట్ల మైలు రాయిని అందుకున్నాడు. బ్రాత్ వైట్ ని అవుట్ చేయడంతో అండర్సన్ ఈ ఘనత సాధించాడు. మైదానంలో సహచర ఆటగాళ్లు, ప్రేక్షకులు సంబరాల్లో మునిగిపోయాడు. మ్యాచ్ ని వీక్షించడానికి వచ్చిన ఓ అండర్సన్ అభిమానికి ఆ క్షణం జీవితంలోనే మధుర క్షణంగా మారిపోయింది.

తన ప్రేయసికి ప్రపోజ్ చేయడానికి ఇంత కంటే మంచి టైమ్ లేదని భావించిన అతడు వంటనే ఎంగేజ్ మెంట్ రింగ్ తో ఆమెకు ప్రపోజ్ చేసేసాడు. ఒకింత ఆశ్చర్యానికి గురైన ఆ యువతి అతడి ప్రేమని అంగీకరించింది. దీనితో ఆ యువకుడు ఎగిరి గంతేశాడు. అప్పటి వరకు స్నేహితులుగా ఉన్న వారు ఆ క్షణం నుంచి ప్రేమికులుగా మారి పోయారు. ఆ దృశ్యాల్ని లార్డ్స్ మైదాన నిర్వాహకులు ఎంగేజ్ మెంట్ ఎట్ లార్డ్స్ పేరిట సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ వీడియో యువతీ, యువకుల్ని విపరీతంగా ఆకట్టుకుంటోంది.

Comments