ప్రచురణ తేదీ : Wed, Jan 11th, 2017

చంద్రబాబుని ఇరకాటంలో పెట్టిన డైరెక్టర్..!

babu-gunashekar
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇరకాటంలో పడ్డారు. రాజకీయ అంశం అనుకుంటే పొరపాటే. చంద్రబాబు చిక్కుల్లో పడింది ఓ సినిమా సంబందించిన విషయంలో. ఇరకాటంలో పెట్టింది కూడా అనేక విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించిన డైరెక్టర్ గుణశేఖర్. విడుదలకు సిద్ధమైన బాలయ్య వందవ చిత్రం గౌతమి పుత్ర శాతకర్ణి చారిత్రాత్మక నేపథ్యం ఉన్న కథ. దీనితో రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు ఈ చిత్రానికి వినోదపు పన్నుని మినహాయించిన విషయం తెలిసిందే. తెలుగు వాడైన గౌతమి పుత్ర శాతకర్ణి చరిత్ర ఆధారంగా ఈ చిత్రం రూపొందిన విషయం తెలిసిందే.

కాగా గుణశేఖర్ గతంలో కాకతీయ వీరనారి రుద్రమ దేవి చరిత్ర ఆధారంగా ‘రుద్రమదేవి’ చిత్రాన్ని రూపొందించిన విషయం తెలిసిందే. ఈ చిత్రానికి కూడా తెలంగాణ ప్రభుత్వం పన్ను మినహాయింపుని కల్పించింది. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం ఆలా చేయలేదు.దీనికోసం అప్పట్లో గుణశేఖర్ ఏపీ ప్రభుత్వాన్ని ఈ చిత్రానికి వినోదపు పన్ను మినహాయించాలని కోరారు. కానీ ఏపీ ప్రభుత్వం ఈవిషయాన్ని పక్కన పెట్టింది.గుణశేఖర్ ఈవిషయంలో ఏపీ ప్రభుత్వాన్ని ఇరకాటం లో పెట్టాడు. గౌతమీపుత్ర శాతకర్ణి చిత్రానికి పన్ను మినహాయింపు కల్పించారు కాబట్టి రుద్రమదేవి చిత్రానికి కూడా వినోదపు పన్ను మినహాయించి ఆ మొత్తాన్ని తనకు తిరిగి ఇవ్వాలని కోరుతున్నారు. ఈ మేరకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కు గుణశేఖర్ బహిరంగ లేఖ రాశారు. చారిత్రాత్మక చిత్రంగా రూపొందుతున్న గౌతమి పుత్ర శాతకర్ణి చిత్రానికి వినోదపు పన్ను మినహాయించినందుకు సాటి తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన వ్యక్తిగా సంతోషిస్తున్నాను.అలాగే రుద్రమదేవి చిత్రానికి విధించిన పన్నుని తిరిగి ఇచ్చి తనని ఆదుకుంటారని భావిస్తున్నట్లు గుణశేఖర్ చంద్రబాబు ని కోరారు.

Comments