ప్రచురణ తేదీ : Dec 7, 2017 9:00 PM IST

11 మంది యువ డాక్టర్లు నిండా మునక..కిలాడీ లేడిల గురించి తెలుసా..?

నూతన రాజధాని అమరావతి కేంద్రంగా దందా సాగిస్తున్న కొందరు కిలాడీ లేడీల గురించి షాకింగ్ నిజాలు బయటకు వస్తున్నాయి. కొందరు యువతులు సాగిస్తున్న దందా గురించి తెలుసుకున్న పోలీస్ లు వాస్తవాలు తెలుసుకుని షాక్ కి గురవుతున్నారు. వీరి బారిన పడిన 11 మంది యువ డాక్టర్లు నిండా మునిపోయినట్లు తేలింది. తమ అందచందాలతో ఉచ్చు పన్ని బాగా డబ్బున్న యువ డాక్టర్ లని టార్గెట్ గా పెట్టుకుంటారు. డాక్టర్ల వద్దకు వైద్యం కోసం వెళ్లినట్లు నటించి అక్కడే మాటలతో మత్తు జల్లుతారు.

తమ శారీరక సమస్యలని చెబుతున్నట్లు మాయచేసి వ్యక్తిగత విషయాలని వెల్లడిస్తున్నట్లు నటిస్తారు. తమ భర్త సంసారానికి పనికిరారని అమాయకంగా వారి వద్ద కల్లబొల్లి కబుర్లు చెబుతారు. తాను ప్రస్తుతం ఒంటరిగా ఉంటున్నానని, వీలైనప్పుడు వచ్చి వైద్యం చేయాలని రిక్వెస్ట్ చేస్తారు. ఇంకే ముందు యువ డాక్టర్ ఆమె ఉచ్చులో చిక్కుకున్నట్లే. ఆమె కోసం ఇంటికి వెళ్ళగానే అందాల పరచి శృంగారానికి ప్రేరేపిస్తారు. అంతా ముగిసాక ఇక మొదలవుతుంది బ్లాక్ మెయిల్ వ్యవహారం. ఇక్కడ జరిగిన సీన్ మొత్తం వీడియో రికార్డ్ చేశామని అడిగినంత డబ్బు ఇవ్వకపోతే బయటకు లీక్ చేస్తామని బెదిరిస్తారు. ఇదీ ఆ కిలాడీ లేడిల అసలు సంగతి.

అమరావతి నుంచి మొదలుకుని కృష్ణ, గుంటూరు, ప్రకాశం జిల్లాలో బయట రాష్ట్రాలనుంచి వచ్చిన కొందరు మహిళల ముఠా ఈ దందా చేస్తున్నట్లు పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో తేలింది. 30 నుంచి 40 ఏళ్ల వయసున్న డాక్టర్ లే వీరి టార్గెట్. వీరి మాయలో ఇప్పటివరకు 11 మంది కుర్ర డాక్టర్ లు వీరి ఉచ్చు కు చిక్కుకున్నారట. ఓ డాక్టర్ అత్యధికంగా 70 లక్షలు సమర్పించుకున్నాడని పోలీస్ లు చెబుతున్నారు. సో..యంగ్ డాక్టర్స్.. బీ కేర్ ఫుల్..!

Comments