జయలలిత నైటీలో ఉంది..అందుకే అంటున్న దినకరన్..!


జయలలిత మరణం విషయంలో అనేక అనుమానాలు నెలకొని ఉన్నాయి. నిజాల్ని నిగ్గు తేల్చే విషయంలో ఎట్టకేలకు తమిళనాడు ప్రభుత్వం ముందడుగు వేసింది. జయలలిత చికిత్సకు సంబందించిన వివరాలని, మరణానికి దారితీసిన పరిస్థితులపై దర్యాప్తు చేయడానికి రిటైర్డ్ జడ్జి ఆర్ముగ స్వామితో తమిళనాడు ప్రభుత్వం కమిటీని నియమించింది. త్వరలో ఈ కమిటీ విచారణ జరిపి ప్రభుత్వానికి నివేదికని అందించనుంది.

ఆరోపణలు ఎదుర్కొంటున్న శశికళ అక్క కొడుకు దినకరన్ ప్రభుత్వం కమిటీని నియమించడంపై స్పదించారు. జయలలిత మరణంపై ప్రభుత్వం ఎలాంటి విచారణ జరిపినా తనకు అభ్యంతరంలేదని ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు దినకరన్ అన్నారు. తనవైపు నుంచి ఎలాంటి సమాచారమైనా కమిటీకి అందజేస్తానని తెలిపారు. కాగా అపోలో ఆసుపత్రిలో జయలలిత చికిత్సకు సంబందించిన వీడియో తనవద్ద ఉందని దినకరన్ అన్నారు. ఆ వీడియోలో జయలలిత నైట్ డ్రెస్ లో ఉండడంతో బయటకు విడుదల చేయడం సబబు కాదనిపించినట్లు దినకరన్ తెలిపారు. అవసరమైతే ఆ వీడియోని కమిటీ సభ్యులకు అందజేస్తానని అన్నారు.

ఆశ్చర్య కరమైన విషయం ఏమిటంటే.. శశికళ జైలుకు వెళ్లక మునుపు ఇదే అన్నా డీఎంకే లోని నేతలు జయ మరణంపై విచారణ అవసరం లేదని పలికారు. కానీ శశికళ జైలుకు వెళ్లాక విచారణ జరపాల్సిందే అని పట్టు బట్టడం విశేషం.

Comments