ప్రచురణ తేదీ : Fri, Jul 28th, 2017

రివ్యూ రాజా తీన్‌మార్ : గౌతమ్ నంద – కొత్తగా ఏంలేదు కానీ స్టైలిష్ గా ఉంది.

తెరపై కనిపించిన వారు : గోపీచంద్, హన్సిక, క్యాథరిన్ థ్రెస

కెప్టెన్ ఆఫ్ ‘ గౌతమ్ నంద’ : సంపత్ నంది

మూల కథ :

టాప్ బిలీనియర్లలో ఒకరైన కృష్ణ మూర్తి కొడుకు గౌతమ్ (గోపీచంద్) అసలు తానెవరు, తనకంటూ ఉండే గుర్తింపు ఏమిటిని తెలుసుకునే ప్రయత్నంలో నందు (గోపీచంద్) ను కలుసుకుంటాడు. నందు ఏమో బస్తీలో పుట్టి, పేదరికం అనుభవిస్తూ ఎలాగైనా ధనవంతుడు కావాలనే ప్రయత్నాల్లో ఉంటాడు.

అలా రెండు విభిన్న నైపథ్యాలు కలిగిన గౌతమ్, నందులు ఒక ఒప్పందం మీద ఒకరి స్థానాల్లోకి మరొకరు వెళతారు. అలా గుర్తింపు మార్చుకున్న ఆ ఇద్దరి జీవితాల్లో ఎలాంటి మార్పులు చోటు చేసుకున్నాయి ? వాళ్ళ కొత్త పరిస్థితులు వాళ్ళను ఏ విధంగా మార్చాయి ? చివరి వారి జీవితాలు ఎలాంటి గమ్యం చేరాయి ? అనేదే తెరపై నడిచే కథ..

విజిల్ పోడు :

–> దర్శకుడు సంపత్ నంది సినిమానౌ విజువల్స్ పరంగా గొప్ప స్థాయిలో చిత్రీకరించారు. ప్రతి ఫ్రేమ్ రిచ్ గా కనిపిస్తూ కనువిందు చేసింది. దీనికి కారణం సినిమాటోగ్రఫర్ సౌందర్ రాజన్ కెమెరా పనితనం కూడా. కనుక వారిద్దరికీ మొదటి విజిల్ వేయొచ్చు.

–> ఇక ఫస్టాఫ్లో ఒక ధనవంతుడి కొడుకు రోజువారీ జీవితం, అతను అనుభవించే లగ్జరీలు ఎలా ఉంటాయి అనేది చిపించిన తీరు, అందుకోసం వాడిన బ్రాండెడ్ యాక్ససిరీస్ ఆకట్టుకున్నాయి. కనుక వాటికి రెండవ విజియల్ వేయొచ్చు.

–> అలాగే సెకండాఫ్ ప్రీ క్లైమాక్స్ లో వచ్చే ఊహించని ట్విస్ట్ తో పాటు క్లైమాక్స్ ను ప్రయోగాత్మకంగా తీసిన విధానం బాగున్నాయి. అవే సినిమాకు మంచి వెయిట్ ను తీసుకొచ్చాయి.

ఢమ్మాల్ – డుమ్మీల్ :

–> సినిమా కథ చాలా పాతది. ఒకేలా ఉన్న ఇద్దరు ఒకరి స్థానంలోకి ఒకరు వెళ్లడం అనే ఈ కాన్సెప్ట్ చూడగానే అయ్యో పాత కథే కదా అనే ఆలోచన వచ్చేస్తుంది. దానికి తోడు దాన్ని మరిపించేలా కొత్త
తరహా కథనం లేకపోవడం మరో మైనస్.

–> ఇక సెకండాఫ్ ఆరంభం నుండి ప్రీ క్లైమాక్స్ వరకు ఎక్కడా ఆకట్టుకునే కథనమే కనబడలేదు. ఎంతసేపటికీ అదే పాత మూస కథనం అవడంతో ఎక్కడా ఆసక్తి అనేదే కలుగలేదు.

–> ఇక సంపత్ నంది పాత కథను కొత్తగా చెప్పే ప్రయత్నంలో పార్టీ స్థాయిలో సక్సెస్ కాలేదు. దీంతో 70 శాతం సినిమా రొటీన్ గా అనిపించి మిగతా 30 శాతం మాత్రమే కొత్తగా తోచింది. అలాగే ఇద్దరు హీరోయిన్లు ఉన్నా ఎక్కడా మంచి ఫీల్ ఇచ్చే రొమాంటిక్ ట్రాక్ అనేది లేకపోవడం మరో నిరుత్సాహకర అంశం.

దేవుడా ఈ సిత్రాలు చూశారా..

–> అన్నేళ్లు చాల రిచ్ గ బ్రతికిన హీరో ఎవరో ఒకరు నువ్వు ఎవరు అని ప్రశించగానే ఇక జీవితమే వృధా అనుకుని చనిపోవాలనుకోవడం విచిత్రంగానే ఉంటుంది.

చివరగా సినిమా చూసిన ఇద్దరు మిత్రులు ఇలా మాట్లాడుకుంటున్నారు..

మిస్టర్ ఏ : ఎలా ఉంది సినిమా ?
మిస్టర్ బి : గోపీచంద్ బాగున్నాడు, బాగా చేశాడు.
మిస్టర్ ఏ : అది సరే సినిమా ఎలా ఉందో చెప్పు ?
మిస్టర్ బి : కొత్తగా ఏం లేదు కానీ స్టైలిష్ గా ఉంది.

Comments