ప్రచురణ తేదీ : Wed, Aug 9th, 2017

కోహ్లీ, ధావన్ కంటే అతనే బెస్ట్ ఆటగాడు : గౌతమ్ గంభీర్

రీసెంట్ గా శ్రీలంక పర్యటనలో టెస్ట్ లను గెలిచిన ఇండియా టీమ్ కు ప్రముఖుల నుంచి ప్రశంసల జల్లులు కురుస్తున్నాయి. అదే విధంగా కోహ్లీని కూడా సీనియర్ ఆటగాళ్లు ఆకాశానికి ఎత్తేస్తున్నారు. భారత జట్టు చరిత్రలో అతనొక బెస్ట్ నాయకుడని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. అయితే ఇప్పుడు ఆ మాటలు కొందరి సీనియర్ ఆటగాళ్లకు నచ్చడం లేదని చెబుతున్నారు. కష్టపడినా ఆటగాళ్లను వదిలేసి ఒక్క కోహ్లీని పొగడడం సరికాదనట్లు విమర్శలు వినబడుతున్నాయి.

రీసెంట్ గా గౌతమ్ గంభీర్ కూడా ఈ తరహా వ్యాఖ్యలపై తనదైన శైలిలో స్పందించాడు. ప్రస్తుత టెస్టు బ్యాట్స్ మేన్స్ లో చటేశ్వర పూజార చాలా మంచి ఆటగాడని కితాబునిస్తు.. కోహ్లీ, ధావన్ కంటే చాలా బాగా అడగలేదని ప్రశంశలను కురిపించాడు.అంతే కాకుండా అతడిని వన్డే మ్యాచ్ లకు కూడా తీసుకుంటే రాణించగలడని చెప్పారు. ప్రస్తుతం టెస్ట్ ఆటగాళ్లకు సరైన గౌరవం దక్కకపోవడానికి కారణం టెస్ట్ మ్యాచ్ లను అంతగా ఎవరు ఆదరించడం లేదని లేకుంటే పుజారా మరో వాల్ అని చెప్పేవారని గౌతమ్ గంభీర్ అభిప్రాయపడ్డాడు.

Comments