ప్రచురణ తేదీ : Feb 28, 2017 6:35 PM IST

పది వివాహాలను ఆపేసిన ఒక్క బాలిక..!


ఆ బాలిక తెలుగు 10 మంది అమ్మాయిల భవిష్యత్తుని నిలిబెట్టింది. కేరళలోని మలప్పురం జిల్లా కరువరకుండు గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. చైల్డ్ లైన్ అధికారులకు ఓ బాలిక తమ గ్రామ పంచాయితీలో తనతోపాటు మరో 10 బాల్య వివాహాలు జరుగుతున్నట్లు సమాచారం ఇచ్చింది. త్వరలో తమ వివాహాలు జరగనున్నాయని కానీ తాను మాత్రం చదువుకోవాలనుకుంటున్నట్లు ఆ అమ్మాయి అధికారులకు ఫోన్ లో తెలిపింది. ఈ వివాహం జరిగితే తాను చచ్చిపోతానని అధికారులకు తెలిపింది.

వివాహం జరుగుతున్న వారిలో ఓ బాలికకు 15 ఏళ్లు కాగా మిగిలినవారికి 16 ఏళ్లు. అధికారులు వెళ్లి ఆ గ్రామంలో విచారించగా ఈ వేసవిలో వారి వివాహాలు జరుగుతున్నట్లు తేలింది. వీరందరి వివాహాలు కొన్ని నెలల క్రితమే నిశ్చయం అయ్యాయి. ఇప్పుడు తమ కుమార్తెలకు వివాహం చేయకుండా ఆలస్యం చేస్తే తరువాత చేయడానికి తమ ఆర్ధిక స్థోమత సరిపోదని తలిదండ్రులు అధికారులకు తెలిపారు. బాలికల వివాహాలు జరగకుండా అధికారులు రద్దు చేసారు. బాల్య వివాహాలు చేయడం నేరమని తల్లిదండ్రులకు అధికారులు కౌన్సిలింగ్ ఇస్తున్నారు.

Comments