ప్రచురణ తేదీ : Dec 27, 2016 5:27 PM IST

గ్యాంగ్‌స్ట‌ర్ అయూబ్ ..72 కేసులు.. 6 మ‌ర్డ‌ర్ కేసులు.. 2 రోబ‌రీలు

ayub-khan
గ్యాంగ్‌స్ట‌ర్ అయూబ్‌ఖాన్‌ని పోలీసులు చాక‌చ‌క్యంగా ప‌ట్టుకుని అరెస్టు చేసిన సంగ‌తి తెలిసిందే. కొత్త పాస్‌పోర్టుతో విదేశాలు పారిపోయేందుకు రెడీ అయిన అత‌డిని ముంబైలో ప‌ట్టుకున్నారు. నేడు అయూబ్‌ని మీడియా ముందుకు ప్ర‌వేశ‌పెట్టారు. ఇత‌గాడి హిస్ట‌రీ తిర‌గేస్తే .. మోస్ట్ వాంటెడ్ క్రిమిన‌ల్ న‌యీమ్ త‌ర‌హాలోనే క‌నిపిస్తోంది. న‌యీమ్‌కి ఎంత భ‌య‌ప‌డేవారో.. గ్యాంగ్‌స్ట‌ర్ అయూబ్‌ఖాన్ అయినా బాధితులు అంతే భ‌య‌ప‌డేవారు. అత‌డికి వ్య‌తిరేకంగా కేసు పెట్టేందుకే జ‌నం భ‌య‌ప‌డేవారు. ఒక అడ్వొకేట్ హ‌త్య కేసులో అత‌డికి వ్య‌తిరేకంగా ఎవ‌రూ పోరాడ‌లేక‌పోయారు. ఒక‌వేళ అవ‌త‌లివాళ్లు కేసు పెట్టాల‌ని చూస్తే హ‌త‌మైపోయిన‌ట్టే.

అయూబ్‌పై పోలీస్ రికార్డ్స్‌లో డీటెయిల్స్ ఆశ్చ‌ర్య‌ప‌రిచేలా ఉన్నాయి. 72 కేసులు 6 మ‌ర్డ‌ర్ కేసులు.. 2 రోబ‌రీ కేసులు, ఎక్స్‌టార్ష‌న్‌.. ఇత‌ర‌త్రా కేసుల‌కైతే కొద‌వే లేదు. అయితే ఆయూబ్ ఆస్తుల వివ‌రాలు కానీ ఇత‌ర‌త్రా బ‌య‌టికి రావాల్సి ఉందింకా. అయూబ్‌కి రియ‌ల్ ఎస్టేట్‌తో బోలెడంత అనుబంధం ఉంది. అత‌డి హ‌త్య‌లు రియ‌ల్ వ్యాపారం చుట్టూ ఉన్నాయి. కాబ‌ట్టి అత‌డి కేసు విచార‌ణ‌లో ఇవ‌న్నీ నిగ్గు తేలుతాయేమో చూడాలి.

Comments