పవన్ కళ్యాణ్ కు మహేష్ బాబు బావ జయదేవ్ కౌంటర్!

సూపర్ స్టార్ మహేష్ బాబు బావ గల్లా జయదేవ్ ప్రస్తుతం అధికార తెలుగు దేశం పార్టీలో కీలకనేతగా ఎంపీగా బాధ్యతలను కొనసాగిస్తోన్న సంగతి తెలిసిందే. అయితే ఆయన పై గత కొంత కాలంగా కొన్ని విమర్శలు వస్తున్నాయి. ఎంపీ పదవిలో ఉన్న జయదేవ్ ప్రజలకు అందుబాటులో ఉండడని కేవలం ఎన్నికల్లో మాత్రమే కనిపిస్తారని కొన్ని వాదనలు వినిపించాయి. అయితే ఈ విషయంపై ఆయన స్పందించారు. పూర్తి అవాస్తవాలు అంటూ.. అభివృద్ధి కోసం ఎంత కష్టపడుతున్నామో మాకు తెలుసు. ఆ విమర్శలను ఎలా తిప్పికొట్టాలో కూడా తనకు తెలుసనీ 2019 లో తప్పకుండా గెలుస్తాను అని ఆయన నమ్మకాన్ని వ్యక్తం చేశారు.

ఇక పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై కూడా జయదేవ్ తనదైన శైలిలో స్పందించారు. కొంత మంది వ్యాపారం చేసుకుంటూనే పదవిని కొనసాగిస్తున్నారని, పోలవరం తో పాటు ప్రజా సమస్యల గురించి పట్టించుకోవడం లేదని పవన్ కొన్ని నెలల క్రితం ఓ మీటింగ్ లో తెలియజేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ విషయంపై జయదేవ్ మాట్లాడుతూ.. వ్యాపారం చేసి నాయకులు అవుతున్న వారు వేరు అలాగే ప్రజా ప్రతినిధులుగా మారిన తరువాత వ్యాపారాలు చేసుకుంటున్న వారు వేరు. ఈ రెండిట్లో చాలా తేడా ఉంది. అయినా తాము పార్లమెంటులో ఆంధ్రప్రదేశ్ కోసం నినాదాలు చేశామని ఇంకా పోరాడుతామని చెబుతూ.. చేతులు కట్టేసి పోరాటం చేయమంటే ఎలా అని రీసెంట్ గా జరిగిన ఇంటర్వ్యూలో తెలియజేశారు.

Comments