ప్రచురణ తేదీ : Dec 4, 2017 10:21 PM IST

రోజా X గాలి.. దుమారం రేగింది..!

నగిరి నియోజకవర్గాల్లో టీడీపీ ఎమ్మెల్సి గాలి ముద్దు కృష్ణమనాయుడు, వైసిపి ఎమ్మెల్యే రోజా మధ్య యుద్ధం సాగుతోంది. ఒకరిపై ఒకరు ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ రాజకీయ ఆధిపత్యాన్ని ప్రదర్శించుకుంటున్నారు. ఇటీవల గాలి ముద్దు కృష్ణమ నాయుడు రోజా పై సంచలన వ్యాఖ్యలు చేసారు. కలెక్టర్ తో కుమ్మక్కై హంద్రీనివా ప్రాజెక్టు అలైన్ మెంట్ మార్చారని గాలి ఆరోపించారు. దీనిపై రోజా ఘాటుగా స్పందించారు. తానేదో నేరం చేసినట్లు ముద్దు కృష్ణమనాయుడు మాట్లాడుతున్నారు. ఆయన చేసిన ఆరోపణలు నిరూపించకపోతే పరువునష్టం దావా వేస్తా అంటూ పుత్తూరులో మీడియా ముందు మాట్లాడారు.

రాజకీయాల్లో అవినీతి డబ్బు సంపాదించే సంస్కృతి తనకు లేదని రోజా అన్నారు. తన 150 పైగా చిత్రాల్లో నటించానని అన్నారు. తాను నిజయతీగా డబ్బు సంపాదించానని అన్నారు. సూట్ కేసులో చేతిలో పెట్టుకుని రాజకీయాల్లో తాను డబ్బు సంపాదించలేదని అన్నారు. తిరుమల దర్శనం టికెట్లు కూడా అమ్ముకునే నేత గాలి అని దుయ్యబట్టారు. వచ్చే ఎన్నికలో కూడా తన నగిరి స్థానాన్ని నిలబెట్టుకోవాలని రోజా తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. రోజాని నిలువరించేందుకు టీడీపీ వ్యూహాలు రచిస్తోంది.

Comments