షాకిచ్చిన డాక్టర్ : తలకి దెబ్బతగిలిందని డాక్టర్ దగ్గరకు వెళితే…….

వాస్తవానికి డాక్టర్ అంటే దేవుడుతో సమానం అంటారు. ఎందుకంటే మనకి ఏదైనా ఆరోగ్య సమస్య వస్తే దానిని పరిష్కరించి, మనకి కొత్త జీవితాన్ని ఇస్తాడు కాబట్టే అలా అంటారు. కానీ ఇటీవల అక్కడక్కడ కొందరు డాక్టర్లు ప్రవర్తనవల్ల రోగులు కొందరు డాక్టర్ల దగ్గరకు వెళ్లాలంటేనే భయపడుతున్నారు. కొద్దిరోజుల క్రితం ఢిల్లీ లో జరిగిన ఒక సంఘటన వింటే నివ్వెరపోవాల్సి వస్తుంది. విషయం లోకివెళితే విజేంద్ర అనే ఒక వ్యక్తి తన తల, అలానే మొహానికి గాయాలయితే వాటి చికిత్స కోసం ఢిల్లీ గవెర్నమెంట్ ఆసుపత్రికి వెళ్ళాడు. అతడు రాగానే పలు పరీక్షలు నిర్వహించిన వైద్యులు, అతడికి ఆపరేషన్ చేయాలన్నారు. అయితే తలకు దెబ్బతగిలింది కాబట్టి తలకి చేస్తారు అనుకుంటే, చివరకు ఆపరేషన్ థియేటర్ కు తీసుకెళ్లి అతని కాలుకి మత్తు ఇంజక్షన్ ఇచ్చి కాలుకి రంధ్రం చేసి మరీ ఆపరేషన్ చేశారు.

అయితే పూర్తిగా అతడు తెలివిలోకి వచ్చాక చూసుకుంటే కాలుకి కుట్లు వేసి వున్నాయి. ఇదేమిటని డాక్టర్లకు ప్రశ్నిస్తే అప్పుడు తెలిసింది. వేరే వాళ్లకు చేయవలసిన ఆపరేషన్ తనకు చేశారని. అయితే ప్రస్తుతం ఈ విషయం విన్న అక్కడి రోగులు భయకంపితులయ్యారు. ఈ విషయమై ఒక కమిటీని వేసిన అక్కడి డాక్టర్ల సంఘం ఆపరేషన్ నిర్వహించిన డాక్టర్లకు చీవాట్లు పెట్టి, తక్షణం వారిని విధులనుండి తప్పించింది. కానీ విజేంద్ర మాత్రం కాలికి జరిగిన ఆపరేషన్తో కొంత మేర అనారోగ్యం పాలయినట్లు, తదనంతరం అక్కడి డాక్టర్లు తనకు చికిత్స అందించినట్లు తెలుస్తోంది…..

Comments