ప్రచురణ తేదీ : Jan 10, 2018 3:07 PM IST

వైరల్ వీడియో : 100 మందితో ఫుట్ బాల్ ఆడిన 3 ప్లేయర్స్

సాధారణంగా ఫుట్ బాల్ మ్యాచ్ లో ఒక జట్టులో 11 మంది ఉంటారు. మరొక జట్టులో కూడా అంతే మంది ఉంటారు. కానీ ఒక మ్యాచ్ లో మొత్తంగా 100 మందికి పైగా ఆటగాళ్లు కనిపించరు. వారు ఆడిన తీరును చూస్తే షాక్ అవ్వకుండా ఉండలేరు. ప్రపంచంలో ఇప్పుడు ఫుట్ బాల్ చాలా ఫెమస్ అవుతోంది. అయితే న్యూ ఇయర్ సందర్బంగా జపాన్ లో అంతర్జాతీయ ఆటగాళ్లు యమగూచి, హిరోషి కియోటకే, యోసుకి ఇడిగూచి ఓ పాఠశాల విద్యార్థులతో కలిసి ఫుట్ బాల్ ఆడారు. ఒకే సారి 100 మంది పిల్లలతో ఆ ఆటగాళ్లు పోటీపడ్డారు. అయితే ఫైనల్ గా వారే గెలిచారు. అందుకు సంబందించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతోంది. పిల్లలను తిక మక పెట్టి చాలా చక చక్యంగా గెలిచారు అని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Comments