ఫ్లాష్ న్యూస్ : పిఎన్ బి కుంభకోణం సూత్రధారి నీరవ్ మోడీ అరెస్ట్ ?
పంజాబ్ నేషనల్ బ్యాంకు భారీ కుంభకోణంలో ముఖ్య సూత్రధారి డైమాండ్ కింగ్ నీరవ్ మోదీ వల్ల ఆ బ్యాంకు పరువు, పరపతి చాలా వరకు మసకబారింది. ఈ ఉదంతం జరిగిన మర్నాడే ఆ బ్యాంకు షేర్లు భారీ స్థాయిలో పతనమయిన విషయం తెలిసిందే. కేవలం ఈ ఒక్క ఉదంతం వల్ల ఆ బ్యాంకు కార్యకలాపాలపై కూడా తీవ్ర ప్రభావం చూపినట్లు తెలుస్తోంది. అయితే ఈ భారీ మోసానికి కారకుడైన వజ్రాల వ్యాపారి, నీరవ్ మోడీని చాలా రోజులనుండి పోలీస్ లు పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. అందుతున్న సమాచారం బట్టి అతన్ని హాంకాంగ్ పోలీసులు అరెస్ట్ చేసే అవకాశమున్నట్లు తెలుస్తోంది. కాగా భారత అభ్యర్థన మేరకు, అక్కడి స్థానిక చట్టాలు, పరస్పర న్యాయ సహాయం ఒప్పందాలపై హాంకాంగ్ పోలీసులు నీరవ్ మోదీని అదుపులోకి తీసుకోనున్నారని చైనా విదేశీ వ్యవహారాల అధికార ప్రతినిధి జెంగ్ షుయాంగ్ తెలిపారు.
ఇటీవలే నీరవ్ మోదీ హాంకాంగ్‌లో ఉన్నట్టు విదేశీ వ్యవహారాల శాఖ మంత్రిత్వ శాఖ పార్లమెంట్‌కు తెలిపింది. పీఎన్బీ కుంభకోణ కేసులో భాగంగా నీరవ్ మోదీని ప్రొవిజనల్ అరెస్ట్ అంటే తాత్కాలిక అరెస్ట్ చేయాలని హాంకాంగ్ అథారిటీలను కోరినట్టు ప్రభుత్వం పేర్కొంది. అయితే 2018 మార్చి 23నే ఈ అభ్యర్థనను హాంకాంగ్ అథారిటీలకు సమర్పించామని మంత్రిత్వ శాఖ సహాయమంత్రి వీకే సింగ్ రాజ్యసభకు తెలిపారు. ఆదివారమే నీరవ్‌కు వ్యతిరేకంగా ముంబై సీబీఐ స్పెషల్ కోర్టు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీచేసిన సంగతి తెలిసిందే. నీరవ్‌తో పాటు మెహుల్ చౌక్సిపై కూడా కోర్టు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీచేసింది. తొలుత నీరవ్ స్విట్జర్లాండ్‌కు పారిపోయినట్టు వార్తలు రాగా, తర్వాత న్యూయార్క్, ఆ అనంతరం హాంకాంగ్‌లో ఉన్నట్టు తెలిసింది…..