ఫ్లాష్ న్యూస్ : ఫ్లిప్ కార్ట్ ను దక్కించుకోనున్న అమెజాన్ ?
ప్రస్తుతం ఆన్ లైన్ లో వస్తువులు విక్రయించే ఈ కామర్స్ సంస్థల మధ్య పోటీ రోజు రోజుకు పెరుగుతోంది. వినియోగదారులకు నాణ్యమైన వస్తువులు సేవలు అందించే విషయమై ప్రతి సంస్థ నూతన పద్ధతులు, విధానాలతో ముందుకు వెళుతున్నాయి. అందులో మరీ ముఖ్యంగా సింహభాగాన్ని ఆక్రమించినవి అయితే అమెజాన్, ఫ్లిప్ కార్ట్ అనే చెప్పుకోవాలి. మన ఇండియాలో ఈ కామర్స్ సంస్థల్లో అత్యధిక మార్కెట్ కలిగివున్నవి ఇవే అని చెప్పవచ్చు. అయితే వీటి మధ్య పోటీ మరీ ఎక్కువకూడ. అయితే అందుతున్న సమాచారం ప్రకారం ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌ను అమెజాన్ కొనుగోలు చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
ఇందుకోసం అమెజాన్.కామ్ కొనుగోలు ప్రతిపాదనలను ఫ్లిప్‌కార్ట్‌కు పంపనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఫ్లిప్‌కార్ట్‌ను కొనుగోలు చేసేందుకు వాల్‌మార్ట్ సంస్థ సంప్రదింపులు జరుపుతోంది. వాల్‌మార్ట్‌తో ఒప్పందమే ముందుకు వెళ్లే అవకాశం ఉందని ఈ వ్యవహరాలతో సంబంధం ఉన్నవారు చెబుతున్నారు. అయితే ఈ తాజా కొనుగోలు ఒప్పందంపై అమెజాన్ ప్రతినిధులు స్పందించలేదు. మరోవైపు ఈ వ్యవహారంపై ఫ్లిప్‌కార్ట్ సంస్థ ప్రతినిధులు స్పందించేందుకు నిరాకరించారు. ఫ్లిప్‌కార్ట్‌లో 40 శాతం కంటే ఎక్కువ వాటాను కొనుగోలు చేయడానికి వాల్‌మార్ట్ సంప్రదింపులు జరుపుతోంది. దీని ద్వారా ఆసియాలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన అమెజాన్‌కు సవాలు విసరాలని భావిస్తోంది….