అమెరికాలో తెలుగువాడికి మరణ శిక్ష !

పదినెలల చిన్నారి శాన్వి, ఆమె అమ్మమ్మ సత్యవతి లని దారుణంగా హతమార్చిన ప్రవాసాంధ్రుడు రఘునందన్ (32) అనే వ్యక్తికి అమెరికా ప్రభుత్వం ఫిబ్రవరి 23 న మరణశిక్ష అమలు చేయనుంది.ఓ ఎన్నారై కు అమెరికాలో ఉరిశిక్ష విధించడం ఇదే తొలిసారి. చిన్నారి శాన్వి ని అపహరించి ఆమె తల్లిందండ్రుల వద్ద నుంచి భారీ మొత్తంలో డబ్బు డిమాండ్ చేయాలని భావించాడు. పోలీస్ లు దర్యాప్తులో ఈ విషయాన్ని నిర్ధారించడంతో న్యాయస్థానం అతడికి మరణశిక్ష విధించింది.

2012 లో జరిగిన ఈ ఘటన అటు అమెరికాలో ఇటు ఇండియాలో తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. ప్రకాశం జిల్లాకు చెందిన ప్రసాద్ రెడ్డి, లత దంపతులకు కుమార్తే చిన్నారి శాన్వి. వీరికి రఘునాధన్ తో పరిచయం ఉంది. కాగా చిన్నారి శాన్విని కిడ్నాప్ చేసి పడ్డ మొత్తంలో డబ్బు డిమాండ్ చేయాలని రఘునందన్ భావించాడు. ఆ సమయంలో చిన్నారి అమ్మమ్మ సత్యవతి అక్కడే ఉండడంతో అతిదారుణంగా ఇద్దరినీ హతమార్చి పరారయ్యాడు. న్యాయస్థానం కేసు విచారణ జరిపి అతడికి ఉరిశిక్ష విధిందింది.

Comments