ప్రచురణ తేదీ : Dec 8, 2017 3:50 AM IST

పవన్ కళ్యాణ్ సినిమాలని ఎవరు చూస్తారు..రోజా హాట్ కామెంట్స్..!

వైజాగ్ లో జగన్ ని ఉద్దేశించి పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ లు పడుతున్నాయి. జగన్ గురించి పరోక్షంగా అయినా పవన్ సంచలన వ్యాఖ్యలు చేసారు. తండ్రి మరణించగానే ముఖ్యమంత్రి కావాలనుకోవడం ఏంటని అన్నారు. జగన్, వైఎస్ ల అవినీతి గురించి కూడా జనసేనాని వ్యాఖ్యలు చేశారు. వారసత్వ రాజకేయాలకు తాను వ్యతిరేకంగా కాదంటూనే.. అలా వచ్చే వారు ప్రతిభ నిరూపించుకోవాలని అన్నారు.

ఈ వ్యాఖ్యలన్నీ జగన్ ని సూటిగా తాకేవే. వైసిపి ఫైర్ బ్రాండ్ రోజా పవన్ కు కౌంటర్ ఇస్తూ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. వారసత్వ రాజకీయ గురించి మాట్లాడుతున్న పవన్ ఒక్కసారి తన గురించి ఆత్మ విమర్శ చేసుకోవాలని అన్నారు. చిరంజీవి సినిమాల్లో లేకుంటే పవన్ కళ్యాణ్ ఎక్కడ ఉండేవారని అన్నారు. చిరంజీవి లేకుంటే పవన్ తో ఎవరు సినిమాలు చేస్తారు ? ఎవరు పవన్ సినిమాలు చూస్తారు ? అని మండి పడ్డారు. ప్రస్తుతం హీరోలుగా తిరుగుతున్న మెగా వారసులంతా చిరు కష్టాన్ని వాడుకుని వచ్చిన వాళ్లే అని అన్నారు. వారసత్వంగా కొంత మందికి కొన్ని అవకాశాలు వస్తాయి. అలాగే తనకు వచ్చిన అవకాశం ద్వారా అసలైన జననేతగా జగన్ నిరూపించుకున్నారని అన్నారు. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం టైమ్ పాస్ రాజకీయాలు చేస్తున్నారని ఘాటుగా విమర్శించారు. రోజా వ్యాఖ్యలకు మెగా ఫాన్స్ మండి పడుతున్నారు. రాజకీయ విమర్శలు చేసేటప్పుడు మెగా హీరోల గురించి ఎందుకు మాట్లాడుతున్నారని, ఇదంతా మీడియాలో హైలైట్ కావాలనే ఎత్తుగడ అని మెగా ఫాన్స్ అంటున్నారు.

Comments